Samantha Health Condition: సమంత ఆరోగ్యం పై షాకింగ్ న్యూస్.. హెల్త్ అప్డేట్ అభిమానులతో పంచుకున్న సామ్..(లైవ్)
టాలీవుడ్ హీరోయిన్ సమంత తన హెల్త్ అప్డేట్ అభిమానులతో పంచుకుంది. మయోసైటిస్ ఆటో ఇమ్యూనీ వ్యాధితో బాధపడుతున్న సమంతా.. ఆ వ్యాధికి సంబంధించిన నెలవారీ ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరపీ...
టాలీవుడ్ హీరోయిన్ సమంత తన హెల్త్ అప్డేట్ అభిమానులతో పంచుకుంది. మయోసైటిస్ ఆటో ఇమ్యూనీ వ్యాధితో బాధపడుతున్న సమంతా.. ఆ వ్యాధికి సంబంధించిన నెలవారీ ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరపీ సెషన్‌కు హాజరైనట్లు చెప్పారు. తాజా హెల్త్ అప్డేట్ ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేశారు. ‘న్యూ నార్మల్’ అంటూ హెల్త్ అప్డేట్ అభిమానులతో పంచుకున్నారు. ఇక మయోసైటిస్‌కు సంబంధించి మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను సమర్థంగా పనిచేయించడంతో పాటు, ఇతర వ్యాధుల కారణంగా ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది. దీని కోసం 2 నుంచి 4 గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చికిత్సను సమంత ఇంట్లోనే తీసుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్నా వ్యాయామాన్ని మాత్రం సామ్ నిర్లక్ష్యం చేయడకుండా.. ఇంట్లోనే జిమ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సమంత ఎప్పటికప్పుడు ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. దీంతో సమంత మయోసైటిస్ ఆటో ఇమ్యూనీ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లే కనిపిస్తుంది. ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తున్నారు సమంత. ప్రజెంట్ సామ్ నటించిన మెథలాజిక్ మువీ శాకుంతల సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ 17న విడుదల కావాల్సిన ‘శాకుంతలం’ వాయిదా పడింది. ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం చెప్పింది. ఈ సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. దీంతో పాటు, విజయ్ దేవరకొండతో ‘ఖుషి’.. వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో సామ్ నటిస్తున్నారు. ఇటీవల ముంబయి వెళ్లిన సమంత ‘సిటాడెల్’ చిత్రీకరణలో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..