బ్యాకప్ మామూలుగా లేదుగా..ఈ మాత్రం ప్లానింగ్ ఉండాల్సిందే..
తెలుగు అగ్ర హీరోలు తమ తదుపరి చిత్రాల కోసం బహుళ దర్శకులతో పటిష్టమైన బ్యాకప్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రాజమౌళి చిత్రాల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, తమ ప్రాజెక్టుల వేగాన్ని కొనసాగించడానికి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లు అనేకమంది దర్శకులను లైన్‌లో పెట్టారు.
తెలుగు సినిమాలోని అగ్ర తారలు తమ భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం పకడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్లాన్ A, B అంటుంటారు కానీ, మన హీరోలు ఏకంగా ప్లాన్ C, Dలతో దర్శకులను క్యూలో ఉంచారు. ఒక్కొక్కరు ఒక్కరిద్దరు కాదు, కొందరైతే అరడజన్‌కు పైగా దర్శకులను బ్యాకప్‌లో పెట్టుకున్నారు. రాజమౌళి చిత్రాల వల్ల ఏర్పడే సుదీర్ఘ విరామాలను దృష్టిలో ఉంచుకొని, ఆ తర్వాత వేగం పెంచేలా హీరోలు అడుగులు వేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెట్స్‌పై ఉండగానే బుచ్చి బాబు, సుకుమార్ వంటి దర్శకులతో ఒప్పందాలు చేసుకున్నారు. సుకుమార్-చరణ్ సినిమా 2026లోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరకు సమయం తీసుకున్నప్పటికీ, తదుపరి ప్రశాంత్ నీల్, కొరటాల శివ, త్రివిక్రమ్, నెల్సన్ వంటి దర్శకులతో సిద్ధంగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
Follow Us
