Indian3: భారతీయుడు 3 ప్లానింగ్‌.. రిస్క్ చేస్తున్నారా?

Edited By:

Updated on: Oct 19, 2026 | 7:33 PM

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 3’పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘భారతీయుడు 2’ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, మూడో భాగంలో కథలో మార్పులు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో సేనాపతి కథను మరింత భావోద్వేగంగా చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సమ్మర్‌లో ప్రభాస్ ‘స్పిరిట్’, మహేశ్ బాబు–రాజమౌళి ‘వారణాసి’ వంటి భారీ చిత్రాలతో పోటీ నేపథ్యంలో విడుదల తేదీపై ఆసక్తి నెలకొంది.

భారతీయుడు 2తో ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయిన మూవీ టీమ్‌, ఇప్పుడు పార్ట్ 3తో ఆ లోటు తీర్చేందుకు రెడీ అవుతోంది. భారతీయుడు 2 టైమ్‌లోనే మూడో భాగం షూటింగ్ పూర్తి చేసిన, ఇప్పుడు కంటెంట్ విషయంలో మార్పులు చేసిన త్రీక్వెల్‌ను ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్‌ తీసుకున్న డెసిషన్ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో డిస్కషన్ జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. కానీ రీసెంట్‌గా భారీ అంచనాలతో వచ్చిన ‘భారతీయుడు 2’ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. స్క్రీన్‌ప్లే, మూవీ లెంగ్త్‌ విషయంలో వచ్చిన విమర్శల వల్ల బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది. అయితే రెండో భాగం క్లైమాక్స్‌లో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇచ్చినా ‘భారతీయుడు 3’ మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అందుకే ఆడియన్స్‌లో అంచనాలు పెంచేందుకు ట్రై చేస్తోంది మూవీ టీమ్‌. ఈసారి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సేనాపతి స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత ఎమోషనల్‌గా చూపించనున్నారు. అందుకు తగ్గట్టుగా కథలో మార్పులు చేసిన కొన్ని సీన్స్‌ను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అది భారతీయుడు 3 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న టైమ్‌లోనే టాలీవుడ్ నుంచి భారీ పాన్ ఇండియా మూవీస్‌ సమ్మర్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేశాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఫిల్మ్ ‘స్పిరిట్’ మూవీని మార్చి 5న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌ ఫస్ట్ టైమ్‌ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ రోల్‌లో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు ఏప్రిల్ 7న ఉగాది కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కూడా బరిలో దిగుతోంది. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా వసూళ్ల సునామీ సృష్టించడం గ్యారెంటీ అన్న అంచనాలు ఉన్నాయి. మరి రెండు ప్రాజెక్ట్స్ మధ్య భారతీయుడు 3కి సమ్మర్‌లో సరైన డేట్ దొరుకుతుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana: రామాయణ సెకండ్ ట్రైలర్‌… విమర్శలకు చెక్‌ పడినట్టేనా?

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు… తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Surya kumar Yadav: దుబాయ్‌లో షారుక్ ఖాన్ ఇంటి పక్కనే.. ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్

Elon Musk: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం!

భారత్‌కు ట్రంప్‌ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్‌!

Loading...
Unable to load recommendations.
Follow Us