వైరల్ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం
ఇచికవా జూలో పంచ్ అనే మకాక్ కోతి పిల్ల కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తల్లి తిరస్కరించడంతో ఒరాంగుటాన్ బొమ్మను తన తల్లిగా స్వీకరించిన పంచ్, దానితో అపురూపమైన బంధాన్ని పెంచుకుంది. ఇప్పుడు మోమో-చాన్ అనే కొత్త స్నేహితురాలు దొరకడంతో దాని ప్రయాణం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ హృదయ విదారక కథ జూకు సందర్శకుల తాకిడిని పెంచింది.
జపాన్‌లోని ఇచికవా సిటీ జూలో ‘పంచ్’ అనే ఆరు నెలల మకాక్ జాతి కోతి పిల్ల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, జూకు పర్యాటకుల తాకిడి పెరిగేలా చేసింది. పంచ్ కోతి పిల్లను చిన్నతనంలో తల్లి దూరం పెట్టడంతో ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం పంచ్‌కి ఓ కొత్త ఫ్రెండ్ దొరికింది. పంచ్ 2025 జూలైలో జన్మించింది. అయితే, దురదృష్టవశాత్తు పుట్టిన వెంటనే తల్లి దాన్ని తిరస్కరించింది. సాధారణంగా ఈ జాతి కోతుల తల్లులు చిన్న వయసులో ఉండడం వల్ల గానీ, లేదా ఇతర బలమైన కోతుల నుంచి ముప్పు ఉన్నప్పుడు గానీ పిల్లలను వదిలేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తల్లి వదిలేయడంతో అనాథగా మారిన పంచ్‌ను జూ సిబ్బంది పెంచడం ప్రారంభించారు. కోతి పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిని హత్తుకుని ఉండటం సహజం. ఆ స్పర్శ లేక ఆందోళన చెందుతున్న పిల్ల కోతికి ఊరట కలిగించేందుకు సిబ్బంది కొన్ని మెత్తటి సాఫ్ట్‌టాయ్స్‌ను , దుప్పట్లను ఇచ్చారు. ఆశ్చర్యకరంగా, పంచ్ వాటిలో ఒక ‘ఒరాంగుటాన్’ బొమ్మను ఎంచుకుంది. అప్పటి నుంచి ఆ బొమ్మే దానికి అమ్మైంది. నిద్రపోయేటప్పుడు దాన్ని గట్టిగా హత్తుకోవడం, ఎక్కడికి వెళ్లినా తనతో తీసుకెళ్లడం వంటి దృశ్యాలు చూపరులను కట్టిపడేసాయి. అమ్మ ప్రేమకు నోచుకోని ఆ చిట్టి కోతి పిల్ల, సాఫ్ట్ టాయ్‌లో తన తల్లిని వెతుక్కుంటున్న వైనం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను కదిలించింది. పంచ్‌ను ఇతర కోతుల సమూహంలోకి ప్రవేశపెట్టారు. అక్కడ ఇతర కోతి పిల్లలు తనను భయపెట్టినా, ఆటపట్టించినా.. పంచ్ ఆ బొమ్మను ఒక రక్షణ కవచంలా అడ్డుపెట్టుకుందని జూ సిబ్బంది తెలిపారు. ఇతర కోతులతో కలుపుగోలుగా ఉంటున్నప్పటికీ, తన ‘బొమ్మ’ని మాత్రం పంచ్ క్షణం కూడా విడిచి పెట్టడం లేదు. వీడియోలు చూసిన నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. పంచ్ అమాయకత్వం, ఆ బొమ్మపై చూపిస్తున్న ప్రేమే ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఆ మధ్యనే వైరల్ కోతి పిల్లను తల్లితో పాటు మిగతా కోతులు దగ్గరకు తీయడంతో అందరూ సంతోషించారు. తనకంటే కొంచెం పెద్దదైన మోమో-చాన్ అనే పేరున్న ఆడ మకాక్ కోతితో పంచ్‌కు స్నేహం ఏర్పడింది. ఆ రెండూ తరచుగా పక్కపక్కనే కూర్చొని ఆడుకోవడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పంచ్ ‘ప్రేమ జీవితం’ సరదాగా గడిచిపోతుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘పంచ్‌కి గర్ల్ ఫ్రెండ్ దొరికింది’ అని సరదాగా మరోకరు కామెంట్ చేశారు. ‘పంచ్ ఫేమస్ కాబట్టే ఫ్రెండ్ దొరికింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
ఇన్‌స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!