ఐ- బొమ్మ రవికి బిగ్ ఝలక్.. అసలేంజరిగిందంటే?
ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. నాలుగు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం రవి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు పిటిషన్లను తిరస్కరించడంతో ఆయన అప్పీల్ చేశారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. తనపై నమోదైన నాలుగు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో నాంపల్లి కోర్టు ఆయన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో రవి ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నారు.ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి పిటిషన్లపై ధర్మాసనం ప్రాథమిక విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణను ఈ శుక్రవారానికి వాయిదా వేసింది. పైరసీకి వ్యతిరేకంగా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. శుక్రవారం జరిగే విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఐబొమ్మ పైరసీ వ్యవహారంపై కొనసాగుతున్న న్యాయపోరాటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం :