RAAKA: ‘రాకా’ తో హాలీవుడ్‌తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ!

Updated on: Jun 28, 2026 | 6:19 PM

'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' కోసం భారీ బడ్జెట్, హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ టీమ్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్లతో పనిచేస్తున్నారు. బన్నీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆయన గ్లోబల్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో ఒక సాధారణ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఒక కుర్రాడు.. నిన్న మొన్నటి ‘పుష్ప’ సినిమా వరకు ఎలా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడో మన కళ్ల ముందే ఉంది. స్టైలిష్ స్టార్‌గా కెరీర్‌ని బిల్డ్ చేసుకుని.. ఇవాళ నేషనల్ అవార్డ్ విన్నర్‌గా, ‘ఐకాన్ స్టార్‌’గా ఎదిగిన వన్ అండ్ ఓన్లీ హీరో అల్లు అర్జున్. ఇదంతా ఓవర్‌నైట్‌లో వచ్చేసిందా? అంటే ఖచ్చితంగా కాదు! తన అద్భుతమైన స్టోరీ సెలక్షన్.. ఇండస్ట్రీలో ఎవరూ ఎంచుకోని పాత్ బ్రేకింగ్ పాలసీ.. అన్నింటికీ మించి సినిమా అంటే ప్రాణం ఇచ్చే ఒక పిచ్చి.. ఇవే అల్లు అర్జున్‌ని ఈ పొజిషన్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. ఏకంగా హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా ఒక బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అదే.. టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ యాంబీషియస్ మూవీ ‘రాకా’. 700 నుంచి 900 కోట్ల బడ్జెట్.. మార్వెల్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ టీమ్.. మెన్ ఇన్ బీస్ట్‌ లాంటి బన్నీ లుక్! అసలు ఏంటి ఈ ‘రాకా’? పుష్ప తర్వాత బన్నీ మైండ్ సెట్ ఎలా మారింది? అట్లీతో ఈ సినిమా చేయడం వెనుక ఉన్న బిగ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో కంప్లీట్ ఎనాలసిస్‌ని డీటెయిల్డ్‌గా చూద్దాం. అల్లు అర్జున్ కెరీర్‌ని మనం సింపుల్‌గా రెండు భాగాలుగా విభజించొచ్చు. ఒకటి.. బిఫోర్ పుష్ప.. రెండు.. ఆఫ్టర్ పుష్ప. పుష్ప సినిమా కంటే ముందు వరకు అల్లు అర్జున్ అంటే కేవలం తెలుగు టూ స్టేట్స్ హీరో. లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలతో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించేవాడు. కేవలం తన డబ్బింగ్ సినిమాలతో మలయాళంలో కూడా తన మార్కెట్‌ను పెంచుకుని అక్కడ ‘మల్లు అర్జున్’గా క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఎప్పుడైతే ‘పుష్ప: ది రైజ్’ మార్కెట్లోకి వచ్చిందో.. బన్నీ కూడా రైజ్ అయ్యాడు. ఆయన క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. నార్త్ ఇండియాలో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా వందల కోట్లు కొల్లగొట్టి.. బాలీవుడ్ ఖిల్లాలోనే బన్నీ జెండా పాతాడు. ఈ ఒక్క సినిమాతో బన్నీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒక సాలిడ్ వాల్ కట్టుకుంటూ వచ్చిన బన్నీ.. పుష్ప తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే ఒక ఐకానిక్ వాల్‌ను బిల్డ్ చేశాడు. ఇప్పుడు బన్నీ టార్గెట్ కేవలం సౌత్ ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియన్ ఆడియన్స్‌ని దాటుకుని, గ్లోబల్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వడమే! పుష్ప తర్వాత బన్నీ నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తున్న తరుణంలో అందరి మైండ్‌లో మెదిలిన ప్రశ్న.. ‘వై అట్లీ?’. అట్లీతో సినిమా ఎందుకు? దీనికి సమాధానం తెలియాలంటే మనం అట్లీ ట్రాక్ రికార్డ్ చూడాలి. ఒకప్పుడు తమిళ్ సినిమాల్లో లేదా టోటల్ సౌత్ ఇండస్ట్రీలో ఒకే రకమైన స్టీరియో టైప్, రెగ్యులర్ స్క్రీన్‌ప్లేలు కనిపించేవి. ఎప్పుడూ ఒకే ప్యాటర్న్ సినిమాలు వస్తున్న టైంలో.. అట్లీ ఒక యంగ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి తన మేకింగ్‌తో కొత్తదనం చూపించాడు. టైట్ స్క్రీన్‌ప్లే, హై-వోల్టేజ్ మాస్ సీన్స్, గూస్‌బంప్స్ వచ్చే హీరోయిక్ ఎలివేషన్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్.. ఇవన్నీ కలిపి ఒక బిగ్ స్టార్ హీరోని ఎలా ప్రెజెంట్ చేయాలో అట్లీకి తెలిసినంతగా బహుశా ఈ జనరేషన్‌లో ఎవరికీ తెలియదేమో! చెన్నై గల్లీల నుంచి స్టార్ట్ అయిన అట్లీ ప్రయాణం.. ఏకంగా ముంబై ఢిల్లీల వరకు వెళ్ళింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను తన స్క్రిప్ట్‌తో మెప్పించి ‘జవాన్’ సినిమా చేశాడు. ఆ సినిమా కేవలం ఇండియాలోనే దాదాపు 643 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ దెబ్బతో.. అట్లీ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లోకి చేరిపోయాడు. అల్లు అర్జున్‌కు కావాల్సింది కూడా ఇదే! నార్త్ బెల్ట్‌లో కంప్లీట్ మాస్ హోల్డ్ ఉన్న దర్శకుడైతేనే.. తన గ్లోబల్ మార్కెట్ కల నిజమవుతుందని బన్నీ నమ్మాడు. నమ్మడమే కాదు.. అట్లీతో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఇక అట్లీ కూడా బన్నీని మరో లెవల్లో చూపించేందుకు రాకాను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. రీసెంట్‌గా టైటిల్ అనౌన్స్ చేయడమే కాదు.. బన్నీ ఫస్ట్ లుక్‌తో గ్లోబల్ రేంజ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది ఈ మూవీ. అసలు ‘రాకా’ సినిమా స్కేల్ ఏంటి? ఇదొక అంబీషియస్, లార్జ్ స్కేల్ ఫాంటసీ యాక్షన్ డ్రామా. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 700 కోట్ల నుంచి 900 కోట్ల వరకు ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే ఈ సినిమా కోసం హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు పనిచేసిన టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీ రంగంలోకి దిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ చూస్తుంటే ఒక ‘మెన్ ఇన్ బీస్ట్’ తరహాలో.. అంటే ఒక పవర్‌ఫుల్ ఫాంటసీ క్యారెక్టర్‌లా కనిపిస్తోంది. అంటే అట్లీ ఆ హాలీవుడ్ స్టాండర్డ్స్‌ను మన స్క్రీన్‌పై చూపించబోతున్నాడన్న మాట. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, స్టంట్ మాస్టర్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్సే రాకా.. కోసం వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి.. బన్నీ ఇంత పెద్ద సినిమా కోసం ఎంత రిస్క్ చేస్తున్నాడు? అట్లీ లాంటి లార్జర్ దాన్ లైఫ్ డైరెక్టర్‌తో 900 కోట్ల ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కాదు. కానీ బన్నీకి తన కష్టం మీద నమ్మకం ఎక్కువ. సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఈ పొజిషన్‌కి రావడానికి కారణం తన ‘పాత్ బ్రేకింగ్ యాటిట్యూడ్’.ఎవరూ చేయని పాత్రలు చేయడం బన్నీకి అలవాటు. ‘ఆర్య’లో వన్ సైడ్ లవర్, ‘వేదం’లో కేబుల్ రాజు, ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి, ‘పుష్ప’లో లారీ క్లీనర్.. ఇలా ఏ స్టార్ హీరో కూడా చేయని ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ‘రాకా’ సినిమా కోసం తన లుక్‌ని, బాడీ లాంగ్వేజ్‌ని కంప్లీట్‌గా మార్చేసుకుంటున్నాడు. అట్లీ విజన్‌కి తగ్గట్టుగా రోజుకు 14-15 గంటలు షూటింగ్‌లో పాల్గొంటూ జెట్ స్పీడ్‌లో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడు. బన్నీ పడుతున్న కష్టం ఇవాళ కనిపించకపోవచ్చు.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అందరి మాటల్లో.. కొట్టే చప్పట్లలో వినిపించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. చివరగా ఒక్కటి మాత్రం నిజం.. ‘రాకా’ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఇండియాలోనే కాదు.. గ్లోబల్ మార్కెట్‌లో ఒక సంచలనంగా మారబోతోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలెంటెడ్ అట్లీ మేకింగ్ స్టైల్, హాలీవుడ్ టెక్నీషియన్స్ సపోర్ట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ క్రేజ్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో పూనకాలే! హాలీవుడ్ మేకర్స్ సైతం అబ్బురపడేలా కంటెంట్ డెలివరీ చేయాలనే బన్నీ కల ఈ సినిమాతో నెరవేరబోతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఔను.. ముగ్గురితో నాకు ఎఫైర్ ఉంది ! ఒప్పుకున్న బిల్ గేట్స్‌

సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..

గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!

టిఫిన్‌ సెంటర్‌లో వేడి వేడిగా వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి!

Follow Us