Hansika Emotional: ‘నేను ఇంకొకరి భర్తను లాక్కోలేదు..’ హన్సిక ఎమోషనల్.. ఏడ్చేసిన అమ్మడు..

|

Feb 13, 2023 | 9:58 AM

ఈ శరీరం అంతా మట్టే అంటూ... అంటూ దేశముదురు సినిమాలో అప్పట్లో హాడావిడి చేసిన హన్సిక.. అనుకున్నట్టే పెళ్లైతే చేసుకున్నారు. తనకు నచ్చిన ఫ్రెండ్‌నే లవర్‌గా..

ఈ శరీరం అంతా మట్టే అంటూ… అంటూ దేశముదురు సినిమాలో అప్పట్లో హాడావిడి చేసిన హన్సిక.. అనుకున్నట్టే పెళ్లైతే చేసుకున్నారు. తనకు నచ్చిన ఫ్రెండ్‌నే లవర్‌గా.. హబ్బీగా మార్చుకున్నారు. కాని ఎందుకనో ఇప్పుడు తెగ ఏడుస్తున్నారు. తన భర్త తన భర్తే అంటూ..! తన భర్త ఎవరి భర్త కాదంటూ..! తన భర్తను.., తన భార్య నుంచి లాక్కోలేదంటూ చెబుతున్నారు.! అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటని మీరనుకుంటున్నారా..! అయితే క్లారిటీ కోసం ఈ స్టోరీ చూడండి!టాలీవుడ్ ను పక్కకు పెడితే.. కోలీవుడ్ లో పీక్ స్టేజ్‌ లో ఉన్న హన్సిక.. ఉన్నట్టుండి పెళ్లి చేసుకుంటున్నా అంటూ అప్పట్లో అందరికీ షాకిచ్చారు. తన ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ సోహైల్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ఇన్ని రోజులకు ఇప్పుడా పెళ్లి వీడియో.. ఓ ఫేమస్ ఓటీటీ యాప్‌లో స్ట్రీమ్‌ అవుతుండడంతో.. నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. దాంతో పాటే.. అదే వీడియోలో తన లవ్‌ స్టోరీ గురించి.. తన మీదొచ్చిన ట్రోల్స్‌ గురించి చెబుతూ ఏడ్చారు. అందర్నీ ఏడిపించారు.ఎస్ ! సోహైల్‌తో పెళ్లి కోసం.. తన పేరెంట్స్‌ను ఒప్పించడం కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పిన హన్సిక… సోహైల్ విషయంలో తనపై అందరూ ట్రోల్ చేశారని ఫీలయ్యారు. సోహైల్‌ను తన ఫస్ట్ భార్య నుంచి లాక్కువన్నావంటూ తనను అందరూ ఆడిపోసుకున్నారన్నారు. అయితే ఇదే విషయం పై తాజాగా తన పెళ్లి వీడియోలో క్లారిటీ ఇచ్చారు హన్సిక. తన ఫ్రెండ్ రింకీ హస్బెండే సోహైల్ అని.. తను కూడా రింకీ లాగే తనకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని.. కాని వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నాకే తాము ప్రేమించుకున్నామన్నారు. అంతేకాని తాను ఎవరి భర్తను లాక్కోలేదంటూ ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అవ్వడమే కాదు.. ట్రోలర్స్‌పై సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయ్యేలా చేసే వారిపై సీరియస్ అయ్యారు హన్సిక.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 13, 2023 09:58 AM