Ananya Nagalla: గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..

Updated on: Nov 15, 2024 | 10:46 AM

టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు.ఇటీవల అనన్య నటించిన చిత్రం పొట్టేల్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో అనన్య పోషించిన బుజ్జమ్మ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక వకీల్ సాబ్ తర్వాత మరో మెగా ఆఫర్ దక్కించుకుందీ ముద్దుగుమ్మ. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో అనన్య నటిస్తుంది. ఇటీవలే ఈ అమ్మడుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్.

సినిమాల సంగతి పక్కన పెడితే.. అనన్య కు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. కొన్ని నెలల క్రితం భారీ వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం, ప్రాణం నష్టం జరిగింది. ఈ క్రమంలోనే అనన్య ముందుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించింది. ఏపీకి సంబంధించిన చెక్ ను స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేసింది. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకుందీ ముద్దుగుమ్మ.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి గిలి చంపేస్తోంది. వృద్ధులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో రో రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. ఇప్పుడు వీరి చలితో గజ గజ వణుకుతున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది అనన్య. హైదరాబాద్ బస్టాండ్ లలో నిద్రిస్తున్న ప్రయాణికులు, పేదలు, అనాథలకు తానే స్వయంగా దుప్పట్లు కప్పింది .ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు అనన్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అనన్య రియల్లీ చాలా గ్రేట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు .హీరోయిన్ అయి ఉండి అంత సింప్లిసిటీగా మంచి పనులు చేయడం చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us