Salman Khan Bodyguard: హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్.!
సినిమా హీరోల సంపాదన కోట్లలో ఉండటం కామనే. కానీ హీరో బాడీ గార్డ్ కూడా సెలబ్రిటీ హోదాలో ఉండటం మీరు ఎక్కడైనా చూశారా? ఆ బాడీగార్డు సంపాదన కోట్లలో ఉందంటే మీరు నమ్ముతారా? అవును బాలీవుడ్ పరిశ్రమలోని ఓ పాపులర్ హీరో బాడీగార్డు గురించి తెలిస్తే తప్పకుండా నమ్మాల్సిందే. చాలా మంది బాలీవుడ్ హీరోల కన్నా ఆ బాడీగార్డే ఎక్కువగా సంపాదిస్తున్నాడట.

అతనెవరో కాదండీ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గుర్మీత్ సింగ్ జాలీ. గత మూడు దశాబ్దాలుగా సల్లూ భాయ్‌కు బాడీగార్డ్‌గా వ్యవహరిస్తున్న ఇతన్ని షేరా అని ముద్దుగా పిలుచుకుంటారు ఇండస్ట్రీ ప్రజలు. గుర్మీత్ సింగ్ జాలీ అలియాస్ షేరా ముంబయి నగరంలో 1969లో పుట్టిన షేరా జూనియర్ బాడీ బిల్డింగ్‌లో ఛాంపియన్ టైటిల్ గెలిచారు. 1987లో మిస్టర్ ముంబయి టైటిల్ కూడా సాధించారు. ఆ తర్వాత 90లలో బాడీ గార్డుగా పని చేయడం మొదలుపెట్టిన గుర్మీత్ ఓ ప్రైవేట్ కంపెనీ కోసం పనిచేశారు. అలా పనిచేస్తున్న సమయంలో 1995లో సల్మాన్ ఖాన్‌కు పరిచమయ్యారు. అతని వ్యక్తిత్వం నచ్చడంతో గుర్మీత్‌ను పర్సనల్ బాడీగార్డుగా నియమించుకున్న సల్మాన్ అప్పటి నుంచి అతడిని వెంటేసుకునే తిరుగుతున్నారు. అలా 30 ఏళ్లుగా తనకు పర్సనల్ బాడీగార్డ్‌గా ఉంటున్న షేరాపై సల్మాన్‌కు నమ్మకం, చనువు రెండూ ఎక్కువే. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీరిద్దరి ఫొటోలే దీనికి నిదర్శనం. కొన్ని ఫొటొల్లో షేరా సల్మాన్ ఖాన్ భూజాలపై చేయి వేసి నిలబడటం మనం చూడచ్చు. ఇంతకీ షేరా జీతం ఎంతన్నది తెలుసుకునేందుకు చాలా మందికి ఆసక్తి చూపిస్తుంటారు. షేరా జీతం ఏడాదికి రెండు కోట్ల రూపాయలు. నెల తిరిగేసరికి ఫస్ట్ తారీఖున అతని అకౌంట్‌లో దాదాపు 17 లక్షల రూపాయలు జమ అవుతాయన్న మాట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.