Manchu Manoj-Mounika: బర్త్‌ డే రోజు.. భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!

|

Oct 06, 2024 | 2:39 PM

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది తండ్రిగా ప్రమోషన్ కూడా కొట్టేశాడు. వారి వైవాహిక బంధానికి ప్రతీకగా మంచు మనోజ్- మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆ తర్వాత తమ గారాల పట్టికి ఘనంగా బారసాల నిర్వహించారు.

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది తండ్రిగా ప్రమోషన్ కూడా కొట్టేశాడు. వారి వైవాహిక బంధానికి ప్రతీకగా మంచు మనోజ్- మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆ తర్వాత తమ గారాల పట్టికి ఘనంగా బారసాల నిర్వహించారు. దేవసేన శోభా ఎంఎం అని నామకరణం కూడా చేసేశారు. ఇక సినిమాల్లోనూ మళ్లీ బిజీ బిజీ అవుతున్నాడు మంచు మనోజ్. ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ లో మనోజ్ కు అన్ని శుభ శకునాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా మౌనిక అడుగు పెట్టినప్పటి నుంచి మనోజ్ జీవితం బాగా మారిపోయిందంటారు. ఈ విషయాన్ని తనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇలా తన జీవితాన్ని రంగులమయంగా మార్చిన మౌనిక పుట్టిన రోజు కావడంతో మంచు మనోజ్ స్పెషల్ గా విషెస్ తెలిపాడు.

తన లైఫ్‌లోని సూపర్ ఉమెన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు మనోజ్‌. అంతేకాదు తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు. పిల్లల కోసం తన భార్య రూపొందించిన ఎడ్యుకేషన్‌ గేమింగ్ యాప్‌ లాంఛ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు మంచు మనోజ్.

ఇక ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మౌనికకు బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు. ఇక మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి కూడా మౌనికకు బర్త్ డే విషెస్ తెలిపింది. హ్యపీ బర్త్‌ డే మౌనిక.. మా జీవితాల్లో చాలా సంతోషాన్ని తీసుకొచ్చావ్… అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టింది మంచు వారమ్మాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on