కమర్షియల్‌కు బ్రేక్.. ఫాంటసీ ప్రపంచంలోకి దూసుకెళ్తున్న టాలీవుడ్ కుర్ర హీరోలు

Edited By:

Updated on: Jul 14, 2026 | 11:04 PM

టాలీవుడ్ యువ హీరోలు ఇప్పుడు కమర్షియల్ కథలకంటే ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథలపై ఆసక్తి చూపుతున్నారు. నాగచైతన్య ‘వృషకర్మ’, నిఖిల్ ‘స్వయంభు’, సాయిధరమ్ తేజ్ కొత్త ఫాంటసీ థ్రిల్లర్, సందీప్ కిషన్ ఫారెస్ట్ అడ్వెంచర్, రోషన్ కనకాల సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రాలతో కొత్త ప్రపంచాలను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభవాన్ని అందించాలన్నదే ఈ ట్రెండ్ వెనుక ప్రధాన ఉద్దేశమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఎంతసేపూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే కుర్ర హీరోలకు కూడా బోర్ కొడుతుంది కదా..? ఏదో ఓ టైమ్‌లో వాళ్లు కూడా లైన్ దాటాల్సిందే కదా.. అదే చేస్తున్నారిప్పుడు మన హీరోలు. ఇమేజ్‌తో పనిలేకుండా.. ఏ మార్కెట్‌తో సంబంధం లేకుండా.. కథ నచ్చితే ఫాంటసీ ప్రపంచంలోకి అడుగులు పెట్టేస్తున్నారు. తాజాగా మరో హీరో ఇదే చేసాడు. మరి ఈ ఫాంటసీ వరల్డ్‌పై మనమూ ఓ కన్నేద్దామా..? మన కుర్ర హీరోలు కమర్షియల్ కథలు కాకుండా ఫాంటసీ ప్రపంచాలు కావాలంటున్నారు. బడ్జెట్ కాస్త ఎక్కువైనా పర్లేదు.. అలాంటి కథలే చేస్తామంటున్నారు. ఆల్రెడీ నాగ చైతన్య వృషకర్మ అంటూ స్పిరిచువల్ డ్రామాతో రాబోతున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ సైతం సంబరాల ఏటిగట్టు తర్వాత క డైరెక్టర్స్ సుజీత్ సందీప్‌తో ఫాంటసీ థ్రిల్లర్ చేయబోతున్నారు. నిఖిల్ స్వయంభు కూడా ఫాంటసీ సినిమానే.. 300 ఏళ్ళ నాటి కథ ఇది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న స్వయంభులో యోధుడిగా నటిస్తున్నారీయన. ది ఇండియా హౌజ్ సినిమా కూడా ఒకరమైన ఫాంటసీ కమ్ పీరియడ్ సినిమా. సందీప్ కిషన్ కూడా శంబాల ఫేమ్ యుగంధర్ ముని కాంబినేషన్‌లో ఫాంటసీ సినిమా అనౌన్స్ చేసారు. ఈ పోస్టర్‌లోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఉన్నాయి.. సందీప్ కిషన్ సినిమా ఫారెస్ట్ అడ్వంచర్ నేపథ్యంలో రానుంది. తాజాగా రోషన్ కనకాల కూడా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా వస్తున్న ఈ చిత్ర కథ వి.ఐ. ఆనంద్ అందించారు. ఈ చిత్రంతో విజయ్ కె. కమిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొత్తానికి ఫాంటసీ కథలే కుర్రాళ్ల మనసుల్ని దోచేస్తున్నాయిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Follow Us