ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి. సినిమా ఇండస్ట్రీలో తరచుగా దీని గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద చర్చే జరిగింది. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు.
కొంతమంది వీటికి వెతిరేకంగా మాట్లాడారు కూడా.. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు చాలా మంది నటీమణులు. అంతే కాదు తమలా ఎవరూ లైంగిక వేధింపుల బారిన పడొద్దని, అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని , అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. తాజాగా హీరోయిన్ ఎస్తర్ కూడా ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్స్ అడుగుతారని.. షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కు కూడా కమిట్మెంట్ అడిగే వాళ్లు ఉన్నారని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఎస్తేర్ నోరోన్హా ! సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో ఎస్తేర్ నోరోన్హా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్‌గా మారలేకపోయింది. ఈ క్రమంలోనే సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని రోజులకే పర్సనల్ కారణాలతో.. నోయల్‌కి విడాకులు ఇచ్చి.. సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి కార్డుపై మహేష్ బాబు !! అట్లుంటది ఘట్టమనేని ఫ్యాన్స్ అంటే