మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణ, వివరాల ధ్రువీకరణలో భాగంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR ప్రక్రియలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు నోటీసులు జారీ అయ్యాయి. మహేష్ బాబు, రాజమౌళి, నమ్రత, వెంకటేష్, సమంత, విజయ్ దేవరకొండ, ఉపాసనతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్ పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్ల నమోదులో పొరపాట్లే కారణంగా అధికారులు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీలైన మహేష్ బాబు, రాజమౌళి తో పాటు పలువురు సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులకు నోటీసులు జారీ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఉన్నట్టుండి సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడం ఏంటి? ఎవరు నోటీసులు ఇచ్చారు? ఏ విషయంపై నోటీసులు ఇచ్చారు? అనేఏ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరి సినీ సెలబ్రిటీలకు, క్రీడా ప్రముఖులతో పాటు మరికొంతమంది ప్రముఖులకు ఈ నోటీసులు అందడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్ లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణ, సవరణలు అలాగే ఓటరు వివరాల ధ్రువీకరణలో భాగంగా SIR అంటే Special intensive revision. సాధారణ ప్రజలతో పాటే స్టార్ సెలబ్రిటీలకు.. క్రీడాకారులకు నోటీసులు పంపించింది. తెలంగాణలో ఎన్యూమరేషన్ పత్రాలలో పేర్ల నమోదులో పొరపాట్లు ఉండడంతోనే ఇలా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు నోటీసులు అందుకున్న సెలబ్రిటీల జాబితాలో రాజమౌళి , మహేష్ బాబు, నమ్రత , వెంకటేష్ ,సమంత , విజయ్ దేవరకొండ తో పాటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఉన్నారు. సినీ ప్రముఖులతో పాటు క్రీడా ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలంపిక్ విజేత సైనా నెహ్వాల్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ జాబితాలో ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mirzapur: మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు
అగ్ని పరీక్ష 2 కారణంగా… ప్రభుత్వ ఉద్యోగం పాయే..! పాపం రామకృష్ణ
ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు!
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్‌నెస్ రహస్యం ఇదే!
