అడ్డంగా బుక్కైన మంగ్లీ.. బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్ మత్తు!

Updated on: Jun 11, 2025 | 4:53 PM

స్టార్ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు. ఆమె బర్త్‌ డే కానుకగా తన నియర్ అండ్ డియర్స్‌కి ఇచ్చిన పార్టీలో కొంత మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్థారించారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు.. పార్టీ ఆర్గనైజ్ చేసిన మంగ్లీ పై కూడా చర్యలకు రెడీ అవుతున్నారు పోలీసులు. ఫోక్ సింగర్ నుంచి సినిమాలో సాంగ్స్‌ పాడే వరకు రీచైన మంగ్లీ.. రీసెంట్‌ డేస్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో పాటలు పాడుతున్నారు.

తన పెక్యులర్ వాయిస్‌తో స్టార్ సెలబ్రిటీల మనసు గెలుచుకోవడంతో పాటే.. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఈక్రమంలోనే 10th జూన్ ఈమె బర్త్‌ డే కావడంతో.. తన ఫ్రెండ్స్‌కు చేవెళ్లలోని త్రిపురారం రిసార్ట్‌లో ఓ పార్టీని ఆర్గనైజ్ చేశారు ఈమె. అయితే ఈ పార్టీ గురించి ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు.. పార్టీ జరుగుతున్న టైంలోనే రిసార్ట్‌కెళ్లి తనిఖీ చేయగా.. భారీగా ఫారెన్ సరుకు పట్టుబడింది. దాంతో పాటే.. పార్టీలో కొంత మంది డ్రగ్స్‌ వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనుమానితులకు డ్రగ్స్‌ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో వారితో పాటు.. ఈ పార్టీ హోస్ట్ చేసిన మంగ్లీ పై కూడా చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడు మామూలోడు కాదు.. ఎదురుపడిన కోబ్రాను ఏం చేసాడంటే

లోయర్ బెర్త్‌లో ఆ పని చేసిన వృద్ధ దంపతులు