Drishyam 3: డివైడ్ టాక్.. కానీ 200 కోట్ల షాక్! ‘దృశ్యం 3’తో మోహన్‌లాల్ మరో రికార్డు
మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం మోహన్‌లాల్ కెరీర్‌లో మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు సాధిస్తున్న ఈ మూవీ విజయంతో ‘దృశ్యం 4’ వచ్చే అవకాశాలపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
సక్సెస్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది అని అడిగిన వారికి సింపుల్ గా… ఇదీ సక్సెస్ అని ఆన్సర్ చెప్పేస్తోంది దృశ్యం త్రీక్వెల్. ఓవర్సీస్‌లోనే కాదు, మన దగ్గర కూడా మంచి కలెక్షన్లతోనే దూసుకుపోతోంది. మూవీకి వచ్చిన టాక్ వేరు… వస్తున్న కలెక్షన్స్ వేరని సంబరపడిపోతోంది ట్రేడ్ వర్గం. దృశ్యం కాన్సెప్ట్ ని జస్ట్ సినిమా అనుకుని సరిపెట్టుకోలేదు జనాలు. అంతకు మించిన ఎమోషన్‌గా ఫీలయ్యారు. ఫస్ట్ రెండు పార్టుల సక్సెస్ కూడా దాన్నే ప్రూవ్ చేసింది. ఇదే చివరి పార్ట్ అంటూ త్రీక్వెల్‌ని రిలీజ్ చేశారు జీతూజోసెఫ్. మొదటి రెండు భాగాలతో పోలిస్తే త్రీక్వెల్‌కి ఇన్‌స్టంట్ హిట్ టాక్ రాలేదు. డివైడ్ టాక్‌తోనే నడిచింది. అయినా ఓవరాల్‌గా 200 కోట్ల క్లబ్‌లో చేరగలిగింది. దృశ్యం త్రీక్వెల్ మోహన్‌లాల్ కెరీర్‌లో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఆయన నటించిన ‘తుడరుమ్’, ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాలు ఆల్రెడీ రెండు వందల కోట్ల కలెక్షన్లు తెచ్చుకున్నాయి. దృశ్యం త్రీక్వెల్ కూడా 200 క్రోర్ క్లబ్‌లో చేరడంతో, హ్యాట్రిక్ రికార్డు ఇప్పుడు మోహన్‌లాల్‌కి సొంతమైంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోందీ దృశ్యం3. ఇప్పటికే 1.15 మిలియన్ల మార్క్ టచ్ చేసింది ఓవర్సీస్‌లో. ఆరు రోజుల్లో ఈ ఫీట్‌ని అందుకున్న థర్డ్ మలయాళం మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేటైమ్‌కి రెండు మిలియన్లను ఎక్స్ పెక్ట్ చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. సో, వీటన్నిటినీ బట్టి చూస్తుంటే మోహన్‌లాలే అన్నట్టు… దృశ్యం 4 కి కూడా స్కోప్ ఉంటుందా? ఫుల్‌స్టాప్ పెట్టేశాననుకున్న జీతూ మళ్లీ ఏదో ఒక లింకుతో స్టోరీని కంటిన్యూ చేస్తారా? అనే క్యూరియాసిటీ మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aadhaar App: ఆధార్ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్
TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు
షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం
Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా
అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ