Kalki Part 2: కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!

|

Jul 07, 2024 | 12:33 PM

ఈ యుగంలో బాక్సాఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని.. ఆ రికార్డులకు కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాతోపాటు ప్రభాస్ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. "ఈ విజయాలన్నింటికీ కారణం.. అక్కడ క్యాజువల్ గా కూర్చొన్న వ్యక్తే. ఆయన ఈ యుగంలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్.

ఈ యుగంలో బాక్సాఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని.. ఆ రికార్డులకు కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాతోపాటు ప్రభాస్ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. “ఈ విజయాలన్నింటికీ కారణం.. అక్కడ క్యాజువల్ గా కూర్చొన్న వ్యక్తే. ఆయన ఈ యుగంలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్. నాకు దర్శకత్వంలో చాలా స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. మనందరి డార్లింగ్. భైరవ ఇప్పుడు K___” అంటూ తన ట్వీట్లో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ రాసుకొచ్చారు నాగ్ అశ్విన్.

అయితే నాగ్ అశ్విన్ కూర్చున ప్రభాస్‌ ఫోటోను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయడమే కాదు.. కల్కి 2 లో ప్రభాస్‌ ఎలా కనిపించనున్నాడో హింట్ ఇచ్చాడు. కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్.. కొద్ది సమయంపాటు కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆలస్యమయ్యిందా ఆచార్య పుత్రా అంటూ చివరి పది నిమిషాలలో కర్ణుడిగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు. ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్ధరిల్లింది. దీంతో కల్కి పార్ట్ 2లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమనుకున్నారంతా…! ఇక ఇప్పుడు అదే విషయాన్ని నాగ్ అశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి పార్ట్ 2లో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతోనే నాగ్ అశ్విన్.. ప్రభాస్ భైరవ.. ఇప్పుడు K అంటూ ఆసక్తి కలిగించాడని అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.