Dhurandhar 2: ధురంధర్ 2 పై బ్యాన్.. షాక్ తప్పదా

Edited By:

Updated on: Feb 19, 2026 | 5:15 PM

ధురంధర్ 2 సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. ముంబై నగర పాలక సంస్థతో B62 స్టూడియోస్ వివాదంలో చిక్కుకోవడమే దీనికి కారణం. షూటింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా స్టూడియోని బ్లాక్‌లిస్ట్ చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ సమస్య షూటింగ్ ఆలస్యం చేసి, మార్చి 19న విడుదల కావాల్సిన ధురంధర్ 2 సినిమా విడుదలకు అడ్డంకిగా మారవచ్చు.

ధురంధర్ 2 సినిమా అనుకున్న టైమ్‌కు వస్తుందా రాదా..? ఆల్రెడీ అంతా రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి డౌట్స్ ఎందుకొస్తున్నాయిప్పుడు అనుకుంటున్నారు కదా..? అంతా సవ్యంగా జరిగితే అనుమానం ఎందుకు వస్తుందొస్తుంది చెప్పండి..? ఏదో తేడా ఉన్నపుడే కదా ఈ డౌట్స్ వచ్చేది. మరి ఆ తేడా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి.. ధురంధర్ సృష్టించిన సంచలనం గురించి కొత్తగా ఏం చెప్పాలి..? పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం ఏకంగా 1400 కోట్లు వసూలు చేసింది. దాంతో పార్ట్ 2పై ఎక్స్‌పెక్టేషన్స్ అలా పెరిగిపోయాయి. మార్చి 19న సినిమా వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేసారు మేకర్స్. కానీ ధురంధర్ 2 అనుకోని వివాదంలో చిక్కుకుందిప్పుడు. అది బయటపడితే గానీ సినిమా అనుకున్న టైమ్‌కు రాదు. ముంబై నగర పాలక సంస్థ నుంచి ధురంధర్ 2 సినిమా నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. షూటింగ్ సమయంలో భద్రతా నిబంధనలను పదేపదే ఉల్లంఘించడంతో.. ఈ స్టూడియోని లోకల్ షూటింగ్ చేయకుండా శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఫోర్ట్ ఏరియాలో ఈ వివాదం చోటు చేసుకుంది. అప్పటికే ఓసారి వార్నింగ్ ఇచ్చాక కూడా అనుమతి లేకుండా ఫోర్ట్ ఏరియాలో బాణాసంతా పేల్చడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడానికి నగరపాలక సంస్థ ఆలోచిస్తుంది. ఈ గొడవతో షూట్ ఆలస్యమవుతుంది. ఇదంతా రిలీజ్ డేట్‌పై ఎఫెక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మార్చి 19న డెడ్ లైన్ అందుకోవడం కష్టం. ఒకదాంతో ఒకటి ఇంటర్ లింక్ అయి ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

Follow Us