ధురంధర్ 2 టాప్ ప్లేస్ దక్కించుకుంటుందా.. రూ.1500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ..

Updated on: Apr 06, 2026 | 9:01 AM

భారత బాక్సాఫీస్‌లో ధురంధర్ 2 సంచలనం సృష్టిస్తోంది. కేవలం 14 రోజుల్లోనే రూ.1460 కోట్లు వసూలు చేసి, బాహుబలి 2, పుష్ప 2 రికార్డులను ఛేదించే దిశగా పయనిస్తోంది. అగ్రపీఠం చేరుకోవాలంటే మూడో వీకెండ్‌లో దాని ప్రదర్శన కీలకం కానుంది. రూ.1800 కోట్ల మార్కును దాటితే సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.

భారత బాక్సాఫీస్ చరిత్రలో ధురంధర్ 2 తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం 14 రోజుల్లోనే ఏకంగా 1460 కోట్ల రూపాయల మార్కును అధిగమించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం హిందీ వెర్షన్ ద్వారానే 900 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించడం ఒక సరికొత్త రికార్డు. ప్రస్తుతం బాహుబలి 2, పుష్ప 2 మాత్రమే 1400 కోట్ల క్లబ్‌లో ఉన్న ఎలైట్ లిస్ట్‌లో ధురంధర్ 2 అత్యంత వేగంగా చేరింది. పుష్ప 2 మొత్తం వసూళ్లు 1700 కోట్ల రూపాయల వద్ద ముగియగా, ధురంధర్ 2 ప్రస్తుత ఆక్యూపెన్సీని బట్టి చూస్తే, మరో వారం రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టి టాప్ 2 స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ నెం.1 స్థానంలో బాహుబలి 2 1800 కోట్ల రూపాయలతో కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ

రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?

హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు

గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం

Follow Us