Gangavva Remuneration: ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

Updated on: Nov 13, 2024 | 9:13 AM

బిగ్ బాస్లో ఆడితేనే ఎక్కువ వారాలు హౌస్‌ మేట్‌గా కొనసాగుతారు. టాస్కుల్లో పెర్ఫార్మ్ చేస్తేనే.. ప్రేక్షకులు కూడా ఓట్లు కుమ్మరించి మనల్ని షోలో ఉండేలా చేస్తారు. కానీ బిగ్ బాస్ సీజన్‌8లో ఆట ఆడకున్నా.. టాస్కుల్లో పాల్గొనకున్నా.. వైల్డ్‌ కార్డ్‌ ట్యాగ్‌తో షోకు ఎంట్రీకి ఇచ్చిన గంగవ్వ.. మంచి పైకాన్నే పట్టింది. జస్ట్ తన క్రేజ్‌తో.. తన ప్రజెన్స్ అండ్‌ అప్పియరెన్స్‌తో... బిగ్ బాస్‌లో కంటిన్యూ అయి.. దాదాపు 17 లక్షల రూపాయలను ప్రైజ్‌ మనీగా గెలుచుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఫ్యామిలీ వీక్ వరకూ మాత్రమే హౌస్ లో ఉంటానని ముందే చెప్పిన గంగవ్వ.. 8వ వారంలోనే అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చింది. ఇప్పటికే హౌస్ లో గంగవ్వను డాక్టర్లు కూడా పరీక్షించారట. దాంతో 9వారంలో ఆమె బయటకు రానుందని అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ఆమెను బయటకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు గంగవ్య రెమ్యునరేషన్ గురించి నెట్టింట ప్రచారం నడుస్తుంది.

\అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన గంగవ్య.. టాస్కులలో చురుకుగా ఉండేది. ఆ తర్వాత చేతి నొప్పితో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో నాగార్జునతో మాట్లాడిన గంగవ్వ బయటకు వెళ్లిపోతానని చెప్పింది. ఇక గంగవ్వ బిగ్‏బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వారానికి రూ.3.5 లక్షల పారితోషికం తీసుకుందంట. అంటే రోజుకు రూ.50 వేలు. అంటే ఆమె హౌస్ లో దాదాపు ఐదు వారాలకు రూ.17.5 లక్షలు తీసుకుందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us