CM Revanth Reddy – Salaar: సలార్‌కు సీఎం రేవంత్ ఫిదా.! నెట్టింట ఇంట్రెస్టింగ్ ట్వీట్.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన పవర్ ప్యాక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది. కనివినీ ఎరుగని కలెక్షన్లతో బాక్సాపీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ న్యూ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెగ నచ్చేసినట్టుండి సలార్ మూవీ. ఇక అసలు విషయం ఏంటంటే! కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ సాదర స్వాగతం లభించింది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన పవర్ ప్యాక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది. కనివినీ ఎరుగని కలెక్షన్లతో బాక్సాపీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ న్యూ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెగ నచ్చేసినట్టుండి సలార్ మూవీ. ఇక అసలు విషయం ఏంటంటే! కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ సాదర స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో తనకు లభించిన గౌరవాన్ని, అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసేందుకు సీఎం రేవంత్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్లో ప్రభాస్ సలార్ లోని సూరీడు సాంగ్ పెట్టారు. అంతే కాదు.. సూరిగే గొడుగు పట్టి పాటలోని కొన్ని లిరిక్స్‌ను కూడా ట్వీట్‌లో జత చేశారు రేవంత్ రెడ్డి. ‘వేగమొకడు..త్యాగమొకడు.. గతము మరువని గమనమే..ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.. ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన..వెరసి ప్రళయాలే.. సైగ ఒకరు.. సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే’ అంటూ సలార్ సాంగ్ లిరిక్స్‌ను రాసుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సలార్ పాట సీఎం రేవంతన్నకు కూడా నచ్చేసిందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!

