ఒక్క వారం.. అరడజను సినిమాల దండయాత్ర వీడియో

Updated on: Dec 26, 2025 | 3:26 PM

చిన్న సినిమాలే కదా అని తీసిపారేయడానికి లేదు.. ఈ వారం వస్తున్న సినిమాలన్నింటిలోనూ కంటెంట్ బాగా కనిపిస్తుంది. ఇయర్ ఎండింగ్‌లో కంటెంట్ మధ్య యుద్ధం కళ్ళ ముందుంది. క్రిస్మస్ రోజు డిఫెరెంట్ జోనర్‌లోనే సినిమాలు వస్తున్నాయి. ఒకదానితో ఒకటి అస్సలు పొంతనే లేదు. అంతా కలిపి దండయాత్రకు రెడీ అవుతున్నారు. మరి అవేంటో చూద్దామా..?

ఒక్క రోజు.. అరడజన్‌ సినిమాలు.. డిసెంబర్ 25న బాక్సాఫీస్ పరిస్థితి ఇది. ఇందులో వేటికవే డిఫెరెంట్ జోనర్‌లో వస్తున్నాయి. వైజయంతి మూవీస్ నిర్మించిన ఛాంపియన్‌ పీరియడ్ యాక్షన్ డ్రామా. 1940స్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా వస్తుంది. తెలంగాణలోని బైరాన్ పల్లి బ్యాక్‌డ్రాప్‌లో సాగే రజాకార్ సినిమా ఇది. క్రిస్మస్‌కే వస్తున్న మరో డిఫెరెంట్ సినిమా శంబాలా. సైన్స్, దేవుడికి మధ్య జరిగే సోషియో ఫాంటసీ ఈ సినిమా. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్‌లోనే విడుదలవుతుండటం గమనార్హం. ఇప్పటికే ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మధ్య బాగా కలిసొస్తున్న హార్రర్ జోనర్‌లో ఈషా సినిమా వస్తుంది.. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. బలగం తరహాలో సాగే తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమాగా దండోరా వస్తుంది. 2 రోజుల ముందే పడిన ప్రీమియర్స్‌కు రెస్పాన్స్ చాలా బాగుంది. శివాజీ, నవదీప్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. వార్ డ్రామాగా మోహన్ లాల్ నటించిన వృషభ సైతం డిసెంబర్ 25నే రానుంది. ఇలా క్రిస్మస్ అంతా విలక్షణ సినిమాలతో నిండిపోయింది.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో