‘విశ్వంభర’ కోసం రంగంలోకి నాగ్ అశ్విన్..?

Edited By:

Updated on: Jun 25, 2026 | 1:20 PM

విశ్వంభర కోసం ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ రంగంలోకి దిగారా..? 1000 కోట్ల సినిమా ఇచ్చిన దర్శకుడే చిరు సినిమాను దగ్గరుండి చూసుకుంటున్నారా..? ఎలాగైనా విశ్వంభరను బయటికి తెచ్చేందుకు టీం విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టిందా..? ట్రోలింగ్ భయంతోనే ఈ సినిమా లేట్ అవుతుందా..? విజువల్ ఎఫెక్ట్స్ అప్‌డేట్ ఏంటి..? ఔట్‌ పుట్ చూసి చిరంజీవి ఏమన్నారు..?

కొన్నాళ్లుగా విశ్వంభర VFXపైనే ఫోకస్ చేసారు దర్శకుడు వశిష్ట. రీసెంట్‌ ఔట్‌ పుట్ చూసి మేకర్స్ హ్యాపీ అవ్వగా.. చిరంజీవి సైతం ఓకే అన్నారని తెలుస్తుంది. మరింత బెటర్ ఔట్ పుట్ కోసం ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచనలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనే దగ్గరుండి విశ్వంభర విఎఫ్ఎక్స్ సూపర్ వైజ్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ రోజుల్లో విజువల్ బేస్డ్ సినిమా వస్తుందంటే ట్రోలింగ్ ఎలా జరుగుతుందో ఊహించొచ్చు. అందుకే విశ్వంభర కోసం నాగ్ అశ్విన్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. చిన్న పొరపాటు కూడా లేకుండా ఉండటానికే మేకర్స్ ఇంత టైమ్ తీసుకుంటున్నారు. గతంలో ఆదిపురుష్, ఆచార్య.. ఈ మధ్యే రాజా సాబ్ లాంటి సినిమాలకే ట్రోలింగ్ సెగ తప్పలేదు. ఇక రీ రికార్డింగ్ కోసం హనుమాన్ ఫేమ్ గౌర హరిని తీసుకున్నారు.

 

Follow Us