పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
బిగ్ బాస్ ఫేం ప్రిన్స్ యావర్ రూ. 23 లక్షల మోసానికి గురయ్యారు. బిల్డర్ నవాజ్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి, పెళ్లి ప్రస్తావనతో డబ్బు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా బెదిరించాడు. ప్రిన్స్ యావర్ తిరిగి అడగ్గా, నవాజ్ ఆయనపై తప్పుడు వేధింపుల కేసు నమోదు చేశాడు. దీంతో ప్రిన్స్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలకు ఇది తాజా ఉదాహరణ.
ఈ మధ్యన సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి వారి కష్టపడి సంపాదించుకున్న డబ్బును లూటీ చేస్తున్నారు. అదేమని నిలదీస్తే.. బెదిరిస్తున్నారు. లేదా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఫేం ప్రిన్స్ యావర్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే మారింది. తెలుగు బుల్లి తెరపై పలు సీరియల్స్ చేస్తూ.. తనకంటూ గుర్తింపు తెచ్చుకునన ప్రిన్స్ యావర్… బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు. తనకంటూ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడంతో పాటు.. సెలబ్రిటీగా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా దూసుకుపోతున్నాడు. ఈక్రమంలోనే బిల్డర్ నవాజ్ అనే వ్యక్తి.. తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానంటూ.. ప్రిన్స్ యావర్‌కి దగ్గరయ్యాడు. ఆ తరవాత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని చెప్పి.. ప్రిన్స్ యావర్ దగ్గర నుంచి 23లక్షలను తీసుకున్నాడు. అంతేకాదు కొన్నాళ్ల తర్వాత ఆ మొత్తానికి 40 లక్షలు ఇస్తానని అతని దగ్గర నమ్మబలికాడు. అయితే డబ్బిచ్చి చాలా రోజులు అవడంతో.. ప్రిన్స్ యావర్ వాటిని తిరిగి అడగగా.. తన అసలు రంగును బయటపెట్టాడు. ప్రిన్స్ యావర్ దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వకపోగా.. బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రిన్స్ బిల్డర్ నవాజ్ చేసిన మోసం పై ఛార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇది గమనిస్తూ ఉన్న బిల్డర్ నవాజ్.. ప్రిన్స్ యావర్ తన కూతురిని వేధిస్తున్నట్టుగా.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేపించాడు. అయితే తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఒక పద్ధతి ప్రకారం తనను ట్రాప్ చేశారని యావర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన పోలీస్ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే
