బిగ్ బాస్‌లో కుల పిచ్చి! మరీ ఇంత నీచమా వీడియో
కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 కుల వివాదంతో వార్తల్లో నిలిచింది. కంటెస్టెంట్లు అశ్విని గౌడ, జాన్విలు రక్షిత్ శెట్టిపై కులపరమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కమ్యూనికేషన్, డ్రెస్సింగ్‌పై నీచమైన కామెంట్లు చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.
బిగ్ బాస్ రియాలిటీ షో వివిధ భాషల్లో విజవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే, ఈ షోలు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా, కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 కుల వివాదంతో తీవ్ర చర్చనీయాంశమైంది. కంటెస్టెంట్లు అశ్విని గౌడ, జాన్విలు తోటి కంటెస్టెంట్ రక్షిత్ శెట్టిపై తీవ్రమైన, కులపరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. నామినేషన్ల చర్చ సమయంలో రక్షిత్ శెట్టి కమ్యూనికేషన్ స్టైల్, కన్నడ భాషా నైపుణ్యం, డ్రెస్సింగ్ గురించి నీచమైన కామెంట్లు చేశారని సమాచారం. “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు. నీ డ్రెస్ చూస్తేనే నువ్వు ఎలాంటి దానివో తెలుస్తోంది. నువ్వు ఎస్ కేటగిరీ. నీ డ్రామాలు బాత్రూంలోనే ఉండనివ్వు” అంటూ రక్షిత్ శెట్టిని అవమానించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
