తప్పతాగి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బెదిరించి.. పరారైన స్టార్ హీరోయిన్
సినీ రంగుల ప్రపంచంలో నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొందరు సెలబ్రెటీలు.. అప్పుడప్పుడు అతిగా ప్రవర్తించి వివాదాల్లో చిక్కుకుంటుంటారు. అనవసర విషయాల్లో తలదూర్చి వివాదాస్పదులుగా ముద్ర వేయించుకుంటుంటారు. ఇప్పుడు హీరోయిన్ లక్ష్మీ మీనన్ కూడా ఇలాగే ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ఈ నటి బుక్కయ్యారు.
ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె పరారయ్యారు. మలయాళ సినిమాల్లో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ లక్ష్మీ మీనన్. ఈ నటి 2011లో తీసిన రఘువింతే స్వాంతం రసియా అనే సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత మలయాళంతోపాటు తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ ఏడాది శబ్దం.. సినిమాతో అలరించింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. కెరీర్ పరంగా మంచి పొజిషన్‌లో ఉన్న ఈ నటి.. నిజ జీవితంలో మాత్రం రౌడీలా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆగస్ట్ 24న రాత్రి తన స్నేహితులతో కలిసి ఓ రెస్టో బార్ కు వెళ్లింది లక్ష్మీ మీనన్. ఈ క్రమంలో అక్కడున్న కొందరు ఐటీ ఉద్యోగులతో ఆమె గొడవకు దిగింది. మాటామాటా పెరగటంతో.. తన స్నేహితులతో కలిసి ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కారులో ఎక్కించుకుని బెదిరిస్తూ.. బూతులు తిడుతూ మరో చోట విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో సదరు బాధితురాలు ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించగా.. గొడవకు కారణంగా లక్ష్మీ మీనన్ పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని పరారైందని గ్రహించిన పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలాగైతే.. అమెరికాలో మనోళ్ల లైఫ్ కష్టమే గురూ
ఇస్రో ఎయిర్‌డ్రాప్ టెస్ట్ సక్సెస్ వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్‌కు మార్గం
వీడియో కోసం వెళితే.. ప్రాణాలే పోయాయి
