హిట్ ఇచ్చాక అసలు పరీక్ష మొదలు.. ఇప్పుడు ఈ హీరోలపై భారీ ఒత్తిడి!

Edited By:

Updated on: May 27, 2026 | 5:04 PM

విభిన్న కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, అడివి శేష్ ఇప్పుడు భారీ అంచనాల మధ్య తమ తదుపరి సినిమాలతో సిద్ధమవుతున్నారు. ‘లక్కీ భాస్కర్’, ‘డీజే టిల్లు’, ‘గూఢచారి’లాంటి హిట్ల తర్వాత అదే స్థాయి విజయాన్ని మళ్లీ అందుకోవాల్సిన ఒత్తిడి ఈ హీరోలపై కనిపిస్తోంది.

వరుసగా సినిమాలు ఎవరైనా చేస్తారు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లోనూ ఏదో ఒక వెరైటీని చూపిస్తారనే గుడ్‌ విల్‌ కొందరికి ఉంటుంది. నెక్స్ట్ మూవ్‌తో దాన్ని నిలబెట్టుకోవాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో అలాంటి హీరోలున్నారు. ఇంతకీ వారెవరో మీకో ఐడియా వచ్చేసినట్టేగా.. కమాన్‌ లెట్స్ వాచ్‌! లక్కీ భాస్కర్‌ సినిమా తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ ఎప్పుడిస్తారా? అని వెయిట్‌ చేస్తున్నారు దుల్కర్‌ సల్మాన్‌ ఫాలోయర్స్. ఆయన చేతిలో ఇప్పుడు ఒకటికి మూడు సినిమాలున్నాయి. ఆకాశంలో ఒక తార ఐ యామ్‌ గేమ్‌, డీక్యూ 41. వీటిలో ఏ ఒక్కటైనా సరే లక్కీ భాస్కర్‌ ని మరిపించే హిట్‌ కావాలన్నదే ప్రస్తుతం ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న డిమాండ్‌. సిద్ధు జొన్నలగడ్డ పేరు చెబితే ఎవరికైనా డీజే టిల్లు గుర్తు రావాల్సిందే. టిల్లు మేనెరిజమ్స్ పేటెంట్‌ హక్కులన్నీ ఆయనకి చెందాల్సిందే. అంతగా ఆ మూవీతో జనాల్లోకి వెళ్లిపోయారు సిద్ధు. టిల్లు క్యూబ్‌ కన్నా ముందే మరో హిట్‌ అందుకుని చూపించాల్సిన సిట్చువేషన్‌లో ఉన్నారీ హీరో. వెరైటీ సినిమాలు అనాలా.. లేకుంటే తనకి పర్ఫెక్ట్ సూట్‌ అయ్యే సినిమాలు అనాలా.. ఏం అనుకున్నా సరే, తనదైన స్టైల్‌లో తను ఏర్పాటు చేసుకున్న పాథ్‌లో ముందుకెళ్తున్నారు కిరణ్‌ అబ్బవరం. ఆ మధ్య కె ర్యాంప్‌తో కేరళను టచ్‌ చేసిన కిరణ్‌ నెక్స్ట్ చెన్నై లవ్‌ స్టోరీతో సిద్ధమవుతున్నారు. అడివి శేష్‌ పేరుకి ఇండస్ట్రీలో స్పెషల్‌ ప్లేస్‌ ఉంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఆయన తీసుకునే కేర్‌ గురించి స్పెషల్‌గా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. రీసెంట్‌గా డెకాయిట్‌తో పలకరించిన శేష్‌, ఇప్పుడు జీ2 పనుల్లో బిజీగా ఉన్నారు. శేష్‌ కెరీర్లో గూఢచారికున్న ప్లేస్‌ ఎలాంటిదో తెలిసిందే. ఆ క్రేజ్‌ని సీక్వెల్‌తో రెట్టింపు చేయాల్సిన బాధ్యత ఉందిప్పుడు శేష్‌ మీద.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు

పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు

US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌

పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!

నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

Follow Us