Nayanthara: నయన్ భర్తకు అవమానం.. పగ తీర్చుకున్న హీరోయిన్.. తన నెక్స్ట్ సినిమాలో చెయ్యకుండా..
లేడీ సూపర్ స్టార్ నయనతార.. మంగమ్మ శపథం చేశారు. తన భర్తకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తన భర్తను అవమానించిన కోలీవుడ్ స్టార్ హీరోపై పగ పట్టారు. అసలు ఈ హీరో పక్కనే నటించనంటూ ప్రతిజ్ఙ పూనారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార.. మంగమ్మ శపథం చేశారు. తన భర్తకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తన భర్తను అవమానించిన కోలీవుడ్ స్టార్ హీరోపై పగ పట్టారు. అసలు ఈ హీరో పక్కనే నటించనంటూ ప్రతిజ్ఙ పూనారు. తన గళాన్ని కాస్త గట్టిగా వినిపించేస్తూ.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.స్టార్ ఇమేజే కాదు.. ఫ్యాన్ బేసే కాదు.. కోలీవుడ్లో తన మాట చెల్లుబాటయ్యేంత కెపాసిటీ ఉన్న నయనతార.. తాజాగా తన భర్తకు జరిగిన అవమానం విషయంలో ఏం చేయలేకపోతున్నారట. తన భర్తను అవమానించిన హీరో అజిత్ పక్కన నటించకుండా ఓ నిర్ణయం అయితే తీసుకున్నారట. ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట కూడా..!ఎస్ ! ఓ పక్క సినిమాలు చేస్తూనే.. తన లవర్ యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయన్.. రీసెంట్‌గా సరోగసి ద్వారా ఇద్దరు కవలలను పొందారు. ఎట్ ప్రజెంట్ వారి ఆలనాపాలనా చూస్తూనే.. స్టార్ హీరోస్ సినిమాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈమె భర్త విఘ్నేశ్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో.. హీరో అజిత్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమా స్టార్ట్ చేయడం కోసమే.. సంవ్సతరం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక తీరా సినిమా స్టార్ట్ అవబోతుందనగా.. స్టోరీ నచ్చలేదంటూ షాకిచ్చారట హీరో అజిత్. లైకా ప్రొడక్షన్స్ లోనే మరో డైరెక్టర్‌తో మరో సినిమాను చేసేందుకు రెడీ అయిపోయారట. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తనను తప్పించడంతో.. విఘ్నేశ్ చాలా ఫీలవుతున్నారట. అవమాన పడ్డానని అనుకుంటున్నారట.ఇక భర్త భాదను చూడలేకపోయిన నయన్.. తన బెస్ట్ ఫ్రెండ్ గా ఫీలయ్యే అజిత్‌తో.. లైకా వాళ్లతో మాట్లాడారాట. స్టోరీ విషయంలో.. సినిమా విషయంలో రాజీ కుదర్చాలని అనుకున్నారట. కాని వారు తమ పని తాము చేసుకుంటూ పోతుండడంతో.. నయన్ కూడా వారితీరుతో ఫీలయ్యారట. హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన అజిత్‌తో ఇకపై సినిమాలు చేయనంటూ ఫిక్స్ అయ్యారట. చర్చల దశలో ఉన్న ఓ సినిమాను రిజెక్ట్ కూడా చేశారట. తన భర్తకు జరిగిన అవమానానికి ఇలా ప్రతీకారం తీసుకుంటున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..