Peddi: హే రామ్.. పెద్దికి పెద్ద అడ్డంకే వచ్చిందిగా

Edited By:

Updated on: Feb 19, 2026 | 5:17 PM

బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమాకు అనూహ్య సమస్యలు ఎదురవుతున్నాయి. షూటింగ్ వాయిదా పడగా, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ 'రామాయణం' సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో 'పెద్ది' రీ రికార్డింగ్ ఆలస్యం అవుతోంది. రంజాన్ మాసం ముందే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెహమాన్ సమయం దొరకక, 'పెద్ది' టీమ్ ఒత్తిడిలో ఉంది.

బుచ్చిబాబు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది పరిస్థితి. అదేంటి అలా అంటున్నారు.. హాయిగా పెద్ది షూటింగ్ జరుగుతుంది.. పైగా పోస్ట్ పోన్ కూడా అయింది ప్రశాంతంగా ఆన్ టైమ్ కంప్లీట్ చేసుకోవచ్చుగా అనుకుంటున్నారు కదా..? కానీ ఓ బాలీవుడ్ సినిమా కారణంగా పెద్దికి చిక్కొచ్చి పడింది. మరి ఏంటా సినిమా..? దానికి పెద్దికి ఏంటి సంబంధం..? బుచ్చిబాబు పరిగెడుతున్నారు.. తన సినిమా పెద్దిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడటంతో దొరికిన నెల రోజుల గ్యాప్ కూడా క్వాలిటీ ఔట్ పుట్ కోసమే ఖర్చు చేస్తున్నారు బుచ్చి. ప్రస్తుతం మేజర్ సీన్స్ చిత్రీకరిస్తున్న ఈ దర్శకుడు.. త్వరలోనే స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారు. జిగేల్ రాణి రేంజ్‌లో ఉండబోతుంది ఈ పాట. అంతా బాగానే ఉన్నా.. పెద్దిపై అతిపెద్ద ప్రెజర్ ఏఆర్ రెహమాన్ నుంచే వస్తుందని తెలుస్తుంది. ఈయన రామాయణ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నారు. వారణాసి తరహాలోనే ఈ సినిమాలో పాత్రల్ని పరిచయం చేస్తూ సౌండ్ అఫ్ రామాయణ పేరుతో ఓ ఆల్బమ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనిపైనే ప్రస్తుతం రెహ్మాన్ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తుంది. దీపావళికి రిలీజ్ అయినా.. రెహ్మాన్‌ను ఇప్పట్నుంచే పరుగులు పెట్టిస్తున్నారు దర్శకుడు నితీశ్ తివారి. అక్కడ బ్యాలెన్స్ చేస్తూ.. పెద్దికి వర్క్ చేస్తున్నారు రెహ్మాన్. పైగా రంజాన్ మాసం మొదలైతే.. రెహ్మాన్ వర్క్ స్లో అవుతుంది. ఈ తక్కువ గ్యాప్‌లోనే పెద్ది రీ రికార్డింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మరి రామాయణ ఎఫెక్ట్ పెద్దిపై పడకుండా రెహ్మాన్ వర్క్ ఎలా పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

Follow Us