వారిద్దరిదీ వయలెంట్ లవ్‌ స్టోరీ.. స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

Updated on: Feb 03, 2026 | 9:45 AM

నిర్మాత షైలేంద్ర సింగ్ సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ పాత సంబంధంపై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. వారి ప్రేమను "రోమియో-జూలియట్" తరహా ఎమోషనల్, "వయలెంట్ లవ్ స్టోరీ"గా అభివర్ణించారు. ఐశ్వర్య గౌరవం, సల్మాన్ అభిరుచిని ప్రశంసించారు. ఐశ్వర్య గత సంబంధాల గురించి కూడా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు, షారుఖ్, ప్రియాంకపై ఆయన అభిప్రాయాలతో పాటు, హాట్ టాపిక్‌గా మారాయి.

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ఓల్డ్ రిలేషన్ పై నిర్మాత శైలేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిదీ “రోమియో-జూలియట్’ తరహాలో ఎమోషనల్ అండ్ ‘వయలెంట్ లవ్ స్టోరీ’ అని పేర్కొన్నారు. ఐశ్వర్య గౌరవప్రదమైన, తెలివైన వ్యక్తని, సల్మాన్ చాలా ప్యాషనేట్ అని తెలిపారు. సల్మాన్ కంటే ముందు ఆమెకు మోడల్ రాజీవ్ మూల్చందనీతో మాత్రమే రిలేషన్ ఉండేదని.. ఇండస్ట్రీలో మరెవరితోనూ లేదని చెప్పారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్తా ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శైలేంద్ర సింగ్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఐశ్వర్య- సల్మాన్ ప్రేమ గురించి ఆయన చేసిన కామెంట్స్‌ ఇప్పటికే నార్త్‌ లో వైరల్ అవగా.. ఇప్పుడు ప్రియాంక చోప్పా- షారుఖ్‌ గురించి ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట తిరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా ఇద్దరూ ఒకే రకమైన మనస్తత్వం ఉన్నవారని, వారిద్దరికీ తమ పని పట్ల విపరీతమైన క్రమశిక్షణ, సినిమా వ్యాపారంపై మంచి అవగాహన ఉందని నిర్మాత శైలేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ నైట్ డ్రెస్‌ వేసుకోమన్నాడు.. వద్దని వచ్చేశా

ప్రొడ్యూసర్‌ను చూస్తుంటే బాధేస్తోంది.. అడుగేస్తే అడ్డంకులే

తెలుగు రాష్ట్రాలను చుట్టుముడుతున్న పులుల

CM Revanth Reddy: KCRకు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు ఇస్తారా

Loading...
Unable to load recommendations.
Follow Us