Bigg Boss Telugu 10: ప్రేమే ఆమెకు శాపంగా.. డేంజర్‌ జోన్‌లో లవ్ బర్డ్‌…!

Updated on: Oct 16, 2026 | 4:52 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 ఆరోవారం నామినేషన్లు ఉత్కంఠగా మారాయి. షాలిని, వర్షిణి, వంశీ, రామ్‌ ప్రసాద్‌, అమన్‌, రోహిత్‌ ఎలిమినేషన్‌ జాబితాలో ఉన్నారు. అనధికారిక ఓటింగ్‌ పోల్స్‌ ప్రకారం రోహిత్‌ అగ్రస్థానంలో ఉండగా, రామ్‌ ప్రసాద్‌, అమన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. షాలిని, వర్షిణి చివరి స్థానాల్లో ఉండటంతో వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ కావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే తుది ఫలితం అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరింత రసవత్తరంగా మారింది. ఐదోవారంలో అనూహ్యంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే ఆరోవారం నామినేషన్స్ యమ హీట్‌గా సాగాయి. కామనర్సన్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు ఒక మినీ వార్ ను తలపించింది. కంటెస్టెంట్స్ మధ్య మాటల తూటాలు పేలాయి. మొత్తానికి ఈ ఆరోవారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. కొత్తగా వచ్చిన వైల్డ్ ఫైర్స్ ద్వారా ఈ నామినేషన్స్ జరిగాయి. షాలిని, వర్షిణి, వంశీ, రాం ప్రసాద్, అమన్, రోహిత్ ఈ వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి? ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎవరేం అనుకున్నా రోహిత్‌కి ఓట్లు అయితే భారీగా పడుతున్నాయి. పైగా ఈవారంలో త్రిగుణ్, ముకేష్‌లు నామినేషన్స్‌లో లేరు కాబట్టి ఓటింగ్ లో రోహిత్ దే టాప్ ప్లేస్. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న అన్ అఫీషియల్ పోల్స్ చూస్తుంటే.. రోహిత్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ఇక రెండో స్థానంలో జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ ఉన్నాడు. కామనర్ అమన్ మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక రోహిత్, షాలినీలకు చుక్కలు చూపించిన టెంపర్ వంశీ ఓటింగ్ లోనూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతను నాలుగో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ లో వంశీ దాదాపు ఉండకపోవచ్చు. ఇక ఐదో స్థానంలో యాంకర్ వర్షిణీ ఉండగా, ఫైర్ బ్రాండ్ షాలినీ ఆరో ప్లేస్ లో ఉంది. అంటే ఈ వారంలో వర్షిణీ, షాలినీ డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. వీరిద్దరిలో ఎవరు ఒకరో ఈ వారం ఎలిమినేట్ కావొచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం షాలినీపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే బిగ్ బాస్ కు అవసరమైన కంటెంట్ ఆమె నుంచే వస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది.అయితే వర్షిని నుంచి పెద్దగా కంటెంట్ రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? లేదా మరొకరు బయటకు వెళ్లిపోతారా? అన్నది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ దాకా వేచి చూడాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు

The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే

Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్

నెట్‌ఫ్లిక్స్‌లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హవా.. దెబ్బకు కపిల్ శర్మ షో వెనక్కి!

లేడీ కంటెస్టెంట్ పై బూతు పురాణం.. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిన బిగ్ బాస్..

Loading...
Unable to load recommendations.
Follow Us