Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ భారీ ఆఫర్. ముఖం మీదే తిరస్కరించి రోహిత్

Updated on: Nov 03, 2026 | 12:47 PM

బిగ్‌బాస్‌ తెలుగు 10లో ఎనిమిదో వారంలో రోహిత్‌ నాయుడు అనూహ్యంగా ఎలిమినేట్‌ అయినట్లు కథనం చెబుతోంది. హౌస్‌మెట్స్‌ ఓట్లతో బయటకు వచ్చిన ఆయనకు నాగార్జున సీక్రెట్‌ రూమ్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే రోహిత్‌ ఆ అవకాశాన్ని తిరస్కరించి షో నుంచి బయటకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆయన నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, సోషల్‌ మీడియాలో బిగ్‌బాస్‌ నిర్వాహకులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌ బాస్ తెలుగు 10’ ఈ షో బిగినింగ్‌ లో.. కర్టెన్ రైజ్ ఈవెంట్లో… “బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ నేనే, నా పేరు రోహిత్ నాయుడు” అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పి ఆట మొదలెట్టిన రోహిత్ నాయు.. ఎనిమిదో వారంలో తన తోటి హౌస్‌ మేట్స్ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నాడు. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న రోహిత్ నాయుడు పట్నం అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఎలిమినేషన్ కంటే కూడా ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక షాకింగ్ న్యూస్‌గా మారింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించిన హోస్ట్ నాగార్జున, మొదట సింగర్ ఝాన్సీని ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా ఎలిమినేట్ చేశారు. అయితే రెండో ఎలిమినేషన్ కోసం ప్రేక్షకుల ఓటింగ్‌ను పక్కనపెట్టి, హౌస్‌మేట్స్ వేసే ఓట్ల ఆధారంగా ఎవరు అనర్హులో తేల్చాలని బిగ్ బాస్ ఆదేశించారు.దీంతో హౌస్‌మేట్స్ అంతా కలిసి విన్నర్ మెటీరియల్ అయిన రోహిత్‌ను టార్గెట్ చేస్తూ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఆడియన్స్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్న కంటెస్టెంట్‌ను హౌస్‌మేట్స్ ఓట్లతో బయటకు పంపడం ప్రేక్షకులని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అయితే, ఈ ఎలిమినేషన్‌ను టీఆర్‌పీ స్టంట్‌గా మలుచుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. రోహిత్‌ను హౌస్ నుంచి బయటకు రప్పించిన తర్వాత స్టేజ్ పైనే నాగార్జున ఆయనకు ‘సీక్రెట్ రూమ్’లోకి వెళ్లే ఆఫర్‌ను ఇచ్చినట్లు సమాచారం. గతంలో సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ విషయంలో చేసినట్టే రోహిత్‌ను కూడా సీక్రెట్ రూమ్‌కి పంపి, మళ్లీ హౌస్‌లోకి పంపాలని ప్లాన్ చేశారు. కానీ రోహిత్ మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ రూమ్ ఆఫర్‌ను ముఖం మీదే తిరస్కరించి నాగార్జునతో పాటు బిగ్ బాస్ టీమ్‌ను షాక్‌కు గురిచేశారట. హౌస్‌లో ఇప్పటికే తనను నెగిటివ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సీక్రెట్ రూమ్‌కి వెళ్తే మరింత నెగిటివ్ చేస్తారే అని నేరుగా చెప్పకపోయినా ఇప్పుడు సీక్రెట్ రూం ఆఫర్ రిజెక్ట్ చేశాడని టాక్. నాగార్జున ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, చివరకు మాజీ విన్నర్ అభిజిత్‌తో , రోహిత్ తల్లితో మాట్లాడించినా కూడా ఆయన తన నిర్ణయం మార్చుకోలేదని సమాచారం. బిగ్ బాస్ ఆఫర్‌ను కచ్చితంగా వద్దని చెప్పి హౌస్ నుంచి బయటకు వచ్చారట రోహిత్. అయితే ఈ ఊహించని షాక్‌తో బిగ్ బాస్ మేకర్స్ ఆశ్చర్యపోగా.., రోహిత్ నిర్ణయాన్ని నెటిజన్లు, ఆయన అభిమానులు హర్షిస్తూ “రియల్ విన్నర్ రోహిత్” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. బిగ్ బాస్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిందూ- ముస్లిం లవ్‌.. బిగ్‌ బాస్‌ నుంచి తమ బిడ్డను.. మధ్యలోనే తీసుకెళ్లిన పేరెంట్స్

Amitabh Bachchan: గ్యాంగ్‌ స్టర్‌ బెదిరించినా.. వెనక్కి తగ్గకుండా ఫ్యాన్స్‌కు కలిసిన అమితాబ్

Shah Rukh Khan: మన హైదరాబాద్ బిడ్డ బాలీవుడ్ ను ఎలా గెలిచాడు

Bigg Boss Rohit: సడెన్‌ ఎలిమినేషనే కాదు.. రెమ్యునరేషన్‌లోనూ నిరాశే!

అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు..

Loading...
Unable to load recommendations.
Follow Us