Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక

Updated on: Apr 07, 2026 | 5:34 PM

బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్, తండ్రి కాన్సర్ చికిత్స కోసం 15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ తీసుకుని బయటకొచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు తండ్రి మరణంతో తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. ఈ దశలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై సీరియస్‌గా స్పందిస్తూ, ట్రోలర్లకు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. తనలోని రాక్షసుడిని బయటకు తీసుకొస్తే తట్టుకోలేరంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు.

బిగ్‌బాస్ సీజన్ 9తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు డీమాన్ పవన్. అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఇతను తన ఆట, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సీజన్ ఆద్యంతం అద్భుతంగా ఆడిన పవన్, ఫైనల్ దశ వరకు చేరి టాప్-3లో నిలిచాడు. అయితే తన తండ్రి కాన్సర్ ట్రీట్మెంట్‌ కోసం 15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌కు ఓకే చెప్పి షో నుంచి బయటికి వచ్చాడు. అనుకున్నట్లుగానే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో పవన్ తన తండ్రి దుర్గా ప్రసాద్ కు ట్రీట్మెంట్ చేయించాడు. అయితే దరుదుష్టవశాత్తు గత నెలలో పవన్‌ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పవన్ బాగా తల్లడిల్లిపోయాడు. ఈ విషాదం నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు.ఈ క్రమంలోనే తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు సీరియస్‌గా బదులిచ్చాడు పవన్. సోషల్ మీడియా వేదికగా డీమాన్ పవన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. కొంత మంది నెటిజన్లు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా సార్లు ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చిన పవన్ ఈసారి మాత్రం మరింత ఇంటెన్స్ తో హెచ్చరించాడు. చాలా మంది తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తప్పు చేయకపోయినా కొంత నెగటివిటీ, ద్వేషాన్ని భరించగలిగే వ్యక్తినని.. తనకు క్షమించే గుణం ఎక్కువని.. ప్రశాంతంగా ఉండడం గురించే ఆలోచిస్తానని పవన్‌ తన పోస్టులో రాసుకొచ్చాడు. తాను మంచికి మంచి చేసే వ్యక్తినని.. అందుకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానంటూ పవన్‌ తన పోస్టులో రాసుకొచ్చాడు. అలాగనీ తనను అలుసుగా తీసుకుని.. ట్రోల్ చేస్తే.. తనలోని రాక్షసుడు బయటకు వస్తాడు. దాన్ని తట్టుకోలేరు అంటూ ట్రోలర్స్‌ను డీమాన్ హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మిక్స్‌డ్‌ రియాక్షన్ ఇస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది

Bombai Ki Ranu: ‘బొంబాయికి రాను’ యూట్యూబ్‌లో అరుదైర రికార్డ్

ధనుష్‌ విడిపోవడం.. జీవితంలో పెద్ద లోటు

Follow Us