Pallavi Prashanth: లక్కీ బాయ్.. పవన్ కళ్యాణ్ సినిమాలో రైతు బిడ్డ

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ దాదాపు తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగనుందని తెలుస్తోంది. అప్పుడే ఈ సారి బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ అలియాస్‌ పల్లవి ప్రశాంత్‌. ఒక కామన్‌ మ్యాన్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ టాప్‌ కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచాడు.

Pallavi Prashanth: లక్కీ బాయ్.. పవన్ కళ్యాణ్ సినిమాలో రైతు బిడ్డ

|

Updated on: Dec 05, 2023 | 9:59 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ దాదాపు తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగనుందని తెలుస్తోంది. అప్పుడే ఈ సారి బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ అలియాస్‌ పల్లవి ప్రశాంత్‌. ఒక కామన్‌ మ్యాన్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ టాప్‌ కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచాడు. తనదైన ఆటతీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఇక హౌజ్‌ బయట కూడా పల్లవి ప్రశాంత్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. సోషల్‌ మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా రైతుబిడ్డ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌ కు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాలో రైతు బిడ్డకు అవకాశం వచ్చిందనేది ఆ వార్త సారాంశం. ఎస్ ! పవన్- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో పల్లవి ప్రశాంత్‌ నటించనున్నాడని టాలీవుడ్‌ మీడియా సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది. డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ బిగ్‌ బాస్‌ తెలుగు రియాలిటీ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతారంట. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ గేమ్‌ డైరెక్టర్‌కు బాగా నచ్చేసిందట. అందుకే పవన్‌ కల్యాణ్ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో తనకు ఒక పాత్ర ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బస్సు కింద పడి చచ్చిపో అంటూ బైకర్ పై దేవెగౌడ కోడలు ఆగ్రహం

నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో ఖడ్గమృగానికి కంటి ఆపరేషన్‌

మిచౌంగ్‌ తుఫానుతో చెన్నై అతలాకుతలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

భారత్ మరో విజయం.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్‌

అయోధ్యలో ప్రతిష్టించడానికి సిద్ధమవుతున్న ధ్వజస్తంభాలు ఇవే

 

Follow us