Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!

|

Oct 10, 2024 | 10:05 AM

డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.. పాన్‌ ఇండియా స్టార్‌ డార్లింగ్‌ ప్రభాస్ పెళ్లి విషయంలో సూపర్‌ క్లారిటీ వచ్చేసింది. ఆ రోజు త్వరలోనే రానుందని ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పారు. నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.. పాన్‌ ఇండియా స్టార్‌ డార్లింగ్‌ ప్రభాస్ పెళ్లి విషయంలో సూపర్‌ క్లారిటీ వచ్చేసింది. ఆ రోజు త్వరలోనే రానుందని ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పారు. నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతోపాటు పై నుంచి కృష్ణంరాజు దీవెనలు కూడా ప్రభాస్‌పై ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు. ప్రభాస్ పెళ్లిపై ఆమె క్లారిటీతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కాబోయే వదిన ఎవరో? అంటూ అప్పుడే వెతుకులాట మొదలెట్టేశారు. కాగా, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ రానుండగా, ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలో నటిస్తున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.