PRABHAS:గ్లింప్స్ -RAJAASAAB
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో రాజా సాబ్ ఒకటి. పక్కా హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్.. వింటేజ్ ప్రభాస్‌ను ఈ సినిమాలో ఈ రీక్రియేట్ చేశారు డైరెక్టర్ మారుతీ. రీ క్రియేట్ చేయడమే కాదు.. రీసెంట్గా ఫ్యాన్ ఇండియా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేశాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఎట్ ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న థమన్ .. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌పై రీసెంట్గా బిగ్ హింట్ ఇచ్చారు. రాజా సాబ్‌లోని ఫస్ట్ సింగిల్.. వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేసాడు. రాజా సాబ్ పాట వినాలి అంటే మరో ఐదు నెలలు ఆగాల్సిందే అని బిగ్ లీక్ ఇచ్చేశాడు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్… వరల్డ్ వైడ్ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
NTR:రెండో పాట విడుదల విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ని వదిలారు-దేవర
ఫియర్ సాంగ్‌తో ఫిల్మ్ మార్కెట్లో సెన్సేషనల్ వైబ్స్ క్రియేట్ చేసిన యంగ్ టైగర్ దేవర.. ఇప్పుడు ఆ వైబ్స్‌ను.. ఓ మెలోడీ సాంగ్‌తో కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఇక అందుకే అన్నట్టు..ఈ మూవీ నుంచి ఓ మెలోడీ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్గా ఈ సాంగ్‌కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో ఈ సాంగ్ జులై 5న రిలీజ్ అవుతున్నట్టు కన్ఫార్మ్ చేసింది. ఇక అదే పోస్టర్లో దేవర.. తన బ్యూటిఫుల్ తంగంతో.. పెనవేసుకుని ఉండడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సాండ్ గురించి ఇంట్రెస్టింగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ట్రిపుల్ ట్రిపుల్ ఆర్.. సెన్సబుల్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్లో .. యంగ్ టైగర్ చేస్తున్న సినిమా ఇది. సో ఈ సినిమా పై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకునేలా ఈ మూవీ ఫస్ట్ పార్ట్.. సెప్టెంబర్ 27న రిలీజ్‌కు రెడీ అవుతోంది.
VD12:ఫస్ట్ లుక్ పోస్టర్
ఫ్యామిలీ స్టార్‌గా అదరగొట్టిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం తన నెక్ట్ సినిమా చేస్తున్నారు. VD12 వర్కింగ్ టైటిల్‌తో.. ఎట్ ప్రజెంట్ షూటింగ్ జరుతున్న ఈ సినిమా నుంచి VD లుక్ బయటికి వచ్చింది. గుండు లుక్‌లో విజయ్ దేవరకొండ కాస్త రస్టిక్‌గా కనిపించడం ఇప్పుడు ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది మార్చ్ 28 వ తేదీన ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
NANI:మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్-సరిపోదా శనివారం
సరిపోదా శనివారం చిత్రంతో అలరించడానికి రెడీ అవుతున్నాడు నాని. ఆగస్ట్ 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిపోయింది ఈ చిత్రం. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలక్షణ నటుడు ఎస్. జే. సూర్య ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ లో హీరో నాని లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. చేతిలో ఆయుధంతో కనిపిస్తున్న నాని లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
KARTHI: సరికొత్త పోస్టర్-సర్దార్ 2
కార్తీ చేస్తున్న చిత్రాలలో సర్దార్ 2 చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. సర్దార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు.మాళవిక మోహనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు మేకర్స్. సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో షీ లుక్స్ వెరీ బ్యూటీఫుల్ .
ADAVI SESH:6 మూమెంట్స్-గూఢచారి 2
ప్రస్తుతం డెకాయిట్ అండ్ గూఢచారి 2 చిత్రాలు చేస్తున్నాడు అడవి శేష్. తాజాగా గూఢచారి 2 కి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను షేర్ చేశాడు. గూఢచారి చిత్రం ఆరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ చిత్రం సీక్వెల్ అయిన గూఢచారి 2 నుండి 6 మూమెంట్స్ ను షేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. Aug 3rd న అంటే ఇవ్వాళే ఈ అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు.
PRIYADARSHI:‘35- చిన్న కథ కాదు’ గ్లింప్స్.
ప్రియదర్శి, నివేత థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘35- చిన్న కథ కాదు’. రానా దగ్గుబాటి సమర్పణలో నందకిశోర్ ఈమని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ప్రియదర్శి లుక్, స్కూల్ సీన్స్ ఆసక్తిగా కనిపించాయి.తాజాగా విడుదలైన గ్లింప్స్ స్కూల్ సన్నివేశాలతో ఆసక్తిగా కనిపించింది. ఇందులో ప్రియదర్శి లెక్కల మాస్టర్ ఎం.చాణక్యవర్మగా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియదర్శి లుక్, స్కూల్ జరిగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గ్లింప్స్ చూస్తుంటే లెక్కల మాస్టారుగా ప్రియదర్శి పాత్ర ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.