Demon Pavan: అప్పుడు ఇజ్జత్ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు
బిగ్‌బాస్ 'వన్స్ మోర్' టాస్క్‌లో భాగంగా, డీమాన్ 'ధమాకా కిక్' గేమ్‌లో తన పాత వైఫల్యాన్ని అధిగమించి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గతంలో ట్రోల్ చేయబడిన డీమాన్, ఈసారి 7.4 అడుగుల ఎత్తులో చెప్పును స్టిక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విజయం ద్వారా అతను ట్రోలర్స్‌కు గట్టి సమాధానం చెప్పడమే కాకుండా, బిగ్‌బాస్ ఫినాలే వీక్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.
వన్స్ మోర్ వన్ లాస్ట్ టైమ్’ అంటూ ఈ సీజన్‌లో జరిగిన బెస్ట్ టాస్కులని మళ్లీ బిగ్‌బాస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు ‘ధమాకా కిక్’ అనే టాస్కు పెట్టాడు. ఈ గేమ్‌లో భాగంగా బోర్డుకి ఎవరు ఎక్కువ హైట్‌లో చెప్పును స్టిక్ చేస్తారో వాళ్లు విన్ అవుతారు. గతంలో జరిగిన ఈ టాస్కులో డీమాన్ ట్రై చేసి స్లిప్ అయి కిందపడ్డాడు. ఆ సమయంలో డీమాన్‌పై దారుణంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. అగ్నిపరీక్షలో డీమాన్ కాళ్లు పైకి పెట్టి చేతులతోనే వాక్ చేసి చూపించాడు.. కానీ రీతూని కలిశాక ఇలా అయిపోయాడంటూ ట్రోల్ చేశారు.ఇక ఇప్పుడు అదే టాస్కు మళ్లీ పెట్టేసరికి డీమాన్ ఈసారి దుమ్ముదులిపేశాడు. పవన్ ఈ టాస్కు గుర్తుందా.. అని బిగ్‌బాస్ వెటకారం ఆడితే.. గుర్తుంది బిగ్‌బాస్.. ఈసారి బాగా ఆడి చూపిస్తా.. 7 ఫీట్ కొట్టి చూపిస్తా.. అంటూ డీమాన్ ఛాలెండ్ చేశాడు. తొలి రౌండ్‌లో 6.4, రెండో సారి 6.8, చివరికి మూడోసారి 7.4.. అడుగుల దగ్గర చెప్పుని స్టిక్ చేసి చూపించాడు డీమాన్. దీంతో గాల్లోకి ఎగిరి రెండు తొడలు కొడుతూ ట్రోలర్స్ నోళ్లు మూయించాడు. ఫినాలే వీక్‌లో డీమాన్ ఆట చూసి.. అసలు రీతూతో కాకుండా అందరితో ఇలా ఉండి ఉంటే డీమాన్ కూడా ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ అయి ఉండేవాడు అంటూ ఆడియన్స్ అనుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ దక్కించున్న భరణి
నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??
Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??
కొత్త సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే..దర్శకుడి కొడుకు లిఫ్ట్ ప్రమాదంలో మృతి
Varanasi: వారణాసి సినిమాలో మరో స్టార్! జక్కన్న వేరే లెవెల్ ప్లాన్
