హీరోలు అవసరం లేదు..! బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలివే

Edited By:

Updated on: Jul 17, 2026 | 7:23 PM

సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్‌పై మరోసారి చర్చ మొదలైంది. ‘స్త్రీ 2’, ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’, ‘గంగూభాయ్ కతియావాడి’, ‘మణికర్ణిక’ వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు నమోదు చేశాయి. గతంలో అనుష్క కూడా స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వసూళ్లతో తన మార్కెట్‌ను నిరూపించింది.

సమంత లీడ్ రోల్‌లో నటించిన మా ఇంటి బంగారం వంద కోట్ల క్లబ్‌లో సత్తా చాటింది. తెలుగులో ఈ ఫీట్ సాధించిన తొలి హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు సామ్‌. దీంతో నేషనల్ లెవల్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్‌ గురించి చర్చ మొదలైంది. ఇంతకీ పాన్ ఇండియా రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీస్‌ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం. పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ సినిమా రేంజ్‌ ఏంటో ప్రూవ్ చేసిన సినిమా స్త్రీ 2. శ్రద్ధా కపూర్‌ లీడ్ రోల్‌లో నటించిన ఈ బాలీవుడ్ మూవీ, చాలా మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్‌లో 870 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద లేడీ ఓరియంటెడ్ మూవీ సాధించిన బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో కల్యాణ్ ప్రియదర్శన్‌ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ‘లోకా: ఛాప్టర్ 1 చంద్ర’ మూవీ కూడా భారీ వసూళ్లు సాధించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ బ్యూటీస్‌ ఆలియా భట్‌, కంగనా రనౌత్‌ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో వందల కోట్ల వసూళ్లు సాధించారు. ఆలియా నటించిన గంగూభాయ్‌ కతియావాడి 200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే, కంగనా రనౌత్‌ నటించిన మణికర్ణిక 150 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. రీసెంట్‌ టైమ్స్‌లో రిలీజ్‌ అయిన ఈ సినిమాలు వందల కోట్ల మార్క్‌ను టచ్ చేయటం పెద్ద విషయం కాకపోయినా… దశాబ్దాల కిందటే అనుష్క లాంటి బ్యూటీస్‌ స్టార్ హీరోలకు పోటి ఇచ్చే రేంజ్‌లో భారీ వసూళ్లు సాధించారు. అప్పటి లెక్కల ప్రకారం వందల కోట్ల మార్క్ టచ్ చేయకపోయినా… వసూళ్ల సునామి సృష్టించి సత్తా చాటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌కు 2026 లక్కీ ఇయర్.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల రేంజ్ కంబ్యాక్ రికార్డులు ఇవే!

టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ షేక్.. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్!

ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్.. స్టార్ బ్యూటీల కెరీర్ గ్రాఫ్ చెబుతున్న నిజాలు!

పెళ్లి తెచ్చిన లక్.. బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్..!

కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!

Follow Us