బాలయ్య బంపర్ ఆఫర్.. కొరటాల ఏం చేస్తారో..?

Edited By:

Updated on: Jun 27, 2026 | 5:54 PM

బాలకృష్ణ–కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న NBK112 అమరావతిలో ఘనంగా ప్రారంభమైంది. రాజధానిలో ప్రారంభమైన తొలి చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుండగా, 2027 వేసవిలో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాలయ్య, కొరటాల సినిమా మొదలైపోయింది.. అమరావతిలో క్లాప్ కొట్టిన మొదటి చిత్రంగా రికార్డుల్లో నిలిచిపోయింది ఈ ప్రాజెక్ట్. మరి దీనికోసం NBK ప్లానింగ్ ఏంటి..? ఇంతకీ కొరటాల బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసారా లేదా ఇంకా చేసే పనిలోనే ఉన్నారా..? రెగ్యులర్ షూట్ ఎప్పుడు.. విడుదల ఎప్పుడు..? బాలయ్య చెప్పినట్లు ఏపీలో ఇకపై సినీ సందడి పెరుగుతుందా..? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది.. బాలకృష్ణ, కొరటాల సినిమా ఓపెనింగ్ అక్కడే జరిగింది. అన్ని భాషల్లో విడుదలయ్యేలా ప్యాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. వెలగపూడిలోని బిట్స్ పిలానీ ప్రాంగణంలో సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇకపై తమ సినిమాల షూటింగ్స్ వీలైనంత వరకు ఏపీలో ఉండేలా చూసుకుంటానని చెప్పారు బాలయ్య. మరోవైపు ఈవెంట్‌కు వచ్చిన కందుల దుర్గేష్, నారా లోకేష్ లాంటి నాయకులు సైతం ఏపీలో ఫిల్మ్ డెవలప్‌మెంట్‌పై హామీ ఇచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే.. సోషల్ మెసేజ్‌తో పాటు కమర్షియల్ హంగులన్నీ ఉండే కథనే బాలయ్య కోసం సిద్ధం చేస్తున్నారు కొరటాల. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ వరకు అక్కడే ఉంటారు బాలయ్య. ఆలోపు NBK112 కథ పూర్తి చేయనున్నారు కొరటాల. రెగ్యులర్ షూట్ ఆగస్ట్ నుంచి ఉంటుందని.. 2027 వేసవికి ఈ సినిమా రిలీజ్ అవుతుందన్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. 150 నుంచి 200 కోట్లతో భారీ స్థాయిలో సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారాయన. ఆచార్య తర్వాత కొరటాల కెరీర్ ట్రాక్ తప్పింది. ఆ తర్వాత దేవర బానే ఆడినా.. అందులో కొరటాలకు క్రెడిట్ రాకపోగా విమర్శలే వచ్చాయి. దాంతో బాలయ్య సినిమా ఈ దర్శకుడి కెరీర్‌కు అగ్నిపరీక్షగా మారింది. NBK112తో బ్లాక్‌బస్టర్ కొట్టి.. తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనే కసితో ఉన్నారు కొరటాల శివ. మొత్తానికి మరి చూడాలిక.. ఈ కాంబోలో రాబోయే ఆ సినిమా ఎలా ఉండబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? త్వరపడండి.. జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్‌!

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు

Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్

రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!

Follow Us