తెలుగు డైరెక్టర్‌ మోసం చేశాడంటూ.. బాలీవుడ్ హీరో ఎమోషనల్..

Updated on: May 09, 2025 | 11:56 AM

బాలీవుడ్ పై నెగెటివ్ కామెంట్స్ చేసి ఒక్క సారిగా సెన్సేషనల్ అయిన ఇమ్రాన్ ఖాన్ బాబిల్ ఖాన్.. ఇప్పుడు ఉన్నట్టుండి తెలుగు డైరెక్టర్‌ సాయి రాజేష్‌ పై అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టాడు. సాయి రాజేష్‌ కోసం రెండేళ్లు జీవితం ధారపోశానని... ఒళ్లు హూనం చేసుకుని మరీ తన శరీరాన్ని సాయి రాజేష్‌ సినిమాలోని పాత్రకు తగినట్టుగా మలుచుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అంతేకాదు తన ప్రయత్నాలను సాయిరాజేష్ మెచ్చుకోవాల్సింది పోను అన్నీ తిర్కరించాడంటూ ఆరోపించాడు బాబిల్. ఎంత బాధన్నా దిగమింగుకుని నవ్వుతూ కనిపించానని ఎమోషనల్ అయ్యాడు. మురికి గుంటల్లో బొర్లానని.. చేయి కూడా కోసుకున్నా అంటూ తన ఆవేదనను తన పోస్టుల్లో వెళ్లగక్కాడు. తన ఆవేదనను.. ఆక్రోశాన్ని ఇన్‌స్టా పోస్ట్ లో తెలియజేశాడు కానీ.. ఆ వెంటనే ఎందుకో తన పోస్టులను డిలీట్ చేశాడు బాబిల్. దీంతో ఈయన కామెంట్స్ ఇప్పుడు బీ టౌన్‌తో పాటు టీ టౌన్లో హాట్ టాపిక్ అవుతోంది. అదర్నీ ఈ విషయం గురించే ఆరా తీసేలా చేస్తోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. బాబిల్‌ను మొదట హిందీ బేబీ సినిమా కోసం సాయి రాజేష్‌ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఏమైందో.. ఏమో కానీ.. బాబిల్‌ను డైరెక్టర్ సాయి రాజేష్‌ పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే సాయి రాజేష్‌… బాబిల్ ను ఎందుకు పక్కకు పెట్టాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో సస్పెన్స్‌గా ఉంది. ఈ క్రమంలోనే సాయి రాజేష్ పై బాబిల్ ఆరోపణలు చేయడం ఇప్పుడు సెన్సేషనల్గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పల్లీలు నానబెట్టి తింటున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే

చల్లగా ఉంటదని పిల్లల్ని ఏసీ గదిలో ఉంచుతున్నారా ??

వైట్‌ హౌస్‌ లోపల ఎలా ఉంటుందో తెలుసా ??

ఈ చేప తెలివి మామూలుగా లేదుగా.. వలనుంచి ఎలా తప్పించుకుందో చూడండి

మన్యం గిరుల్లో పూసే.. ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా !!