బాలీవుడ్ హీరోకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చూస్తూ ధమ్కీ
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపు ఆడియో సందేశం వచ్చినట్లు సమాచారం. అజ్ఞాత వ్యక్తి పంపిన వాయిస్ మెసేజ్‌పై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలర్‌కు నిజంగా గ్యాంగ్‌తో సంబంధాలున్నాయా లేక పేరు వాడుకుని బెదిరించాడా అనే కోణంలో విచారిస్తున్నారు. గతంలో తుషార్ కపూర్ సహా పలువురు ప్రముఖులకూ ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు కథనాలు చెబుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక బెదిరింపు ఆడియో సందేశం రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి అజ్ఞాత వ్యక్తి నుంచి వాయిస్ మెసేజ్ రూపంలో బెదిరింపు కాల్ రాగా, తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులమని చెబుతూ వారు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఆడియో క్లిప్‌ను అందుకున్న ముంబై పోలీసులు దీనిపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. కాలర్ నిజంగానే ఆ గ్యాంగ్‌కు చెందినవాడా లేక ఎవరైనా గ్యాంగ్ పేరు వాడుకుని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో ఆడియో రికార్డులను ఇప్పటికే ఉన్న పోలీసు రికార్డులతో పోల్చి పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నటుడు తుషార్ కపూర్, అలాగే మరికొంత మంది ప్రముఖులకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన మరియు వరుస బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్‌నకు సంబంధించి ప్రాథమిక విచారణ జరుగుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలు ప్యాంటుకి 2nd వరల్డ్ వార్‌కి లింకేటో తెలుసా? ఇట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన రేణు దేశాయ్
