Ashika Ranganath: షాకింగ్ ఘటన! స్టార్ హీరోయిన్ బంధువైన అమ్మాయి ఆత్మహత్య

Updated on: Dec 02, 2025 | 1:27 PM

టాలీవుడ్ నటి ఆషికా రంగనాథ్ మేనమామ కూతురు అచల్ ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. దూరపు బంధువు మయాంక్ వేధింపులే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, మయాంక్, అతని తల్లిని వెంటనే అరెస్టు చేయాలని అచల్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నవంబర్ 22న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టాలీవుడ్ హీరో ఆషికా రంగనాథ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె మేనమామ కూతురు అచల్ ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 22 సంవత్సరాలు. నవంబర్ 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగి 10 రోజులు గడిచినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అసలువిషయం ఏంటంటే..! అచల్ తన దూరపు బంధువు మాయంక్ ను ప్రేమించింది. కానీ అతడు ఆమెపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అచల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆషికా రంగనాథ్ మామ కూతురు అచల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరబోతుండగా, ఆమె తన దూరపు బంధువు మయాంక్ తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. మాయంక్ అచల్ పెళ్లి చేసుకుంటానని ఆమె ఇంట్లో ఒప్పించాడు. కానీ అప్పటివరకు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో, మయాంక్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడని.. ఆమెకు పదే పదే ఫోన్ చేసి బెదిరించేవాడని అచల్ కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. మాదకద్రవ్యాల బానిస అయిన మయాంక్ చాలా మంది యువతులతో శారీరక సంబంధం కలిగి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అచల్ మానసికంగా కుంగిపోయింది. ఆపై అతడు తనను వేధించడంతో తీవ్ర మనస్తాపం చెందిన అచల్.. తన బంధువుల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు సూసైడ్ పై అచల్ తల్లిదండ్రులు మయాంక్, అతడి తల్లి మైనా పై పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అచల్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Divya Nikitha: కామనర్ అయినా.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ! లక్కీ గార్ల్‌

Samantha: భూతశుద్ధి ప్రక్రియలో పెళ్లి.. ఈ పెళ్లి విశిష్టత ఏంటంటే ??