టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ!

Edited By:

Updated on: Jul 14, 2026 | 6:09 PM

అఖిల్ నటించిన ‘లెనిన్’ విజయంతో టాలీవుడ్‌లో టికెట్ ధరలపై మరోసారి చర్చ మొదలైంది. సాధారణ టికెట్ రేట్లతో విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌తో పాటు బలమైన వసూళ్లు నమోదు చేస్తోంది. నిర్మాత నాగవంశీ, రామ్ చరణ్ వంటి ప్రముఖులు కూడా అందుబాటు ధరలు, ముఖ్యంగా థియేటర్ ఫుడ్ ధరలపై గతంలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సరసమైన ధరలు, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే వాదనకు ‘లెనిన్’ మరో ఉదాహరణగా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇండస్ట్రీలో టికెట్ రేట్లను మించిన హాట్ టాపిక్ ఏముంటుంది చెప్పండి..? మొన్నటి వరకు నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య రేగిన రచ్చలో కూడా ఈ రేట్లదే కీ రోల్. తాజాగా మరోసారి టికెట్ రేట్ల మీద చర్చ మొదలైంది. దానికి కారణం అఖిల్ సినిమానే.. మరి లెనిన్‌తో టికెట్ రేట్లకు ఏంటి సంబంధం..? అసలేం జరుగుతుంది..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికంటే ఎక్కువే రచ్చ చేస్తున్నాడు లెనిన్. అఖిల్ ట్రాక్ రికార్డులతో పనిలేకుండా ఓపెనింగ్స్ రప్ఫాడిస్తుంది ఈ చిత్రం. దానికి ప్రధాన కారణం కంటెంట్ ఒకటైతే.. మరోటి టికెట్ రేట్స్. నార్మల్ ప్రైస్‌లతో రావడం లెనిన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. సింగిల్ స్క్రీన్స్ 100, 150 ఉంటే.. మల్టీప్లెక్స్ 200, 250 మధ్యలోనే ఉన్నాయి. అదే సినిమాకు ప్లస్ అవుతుంది. లెనిన్‌కు మాత్రమే కాదు.. టికెట్ రేట్లు అందుబాటులో ఉండి కంటెంట్ ఏమాత్రం కనెక్టైనా కూడా.. ఆడియన్స్ అక్కున చేర్చుకుంటున్నారు. అది మన సినిమానా, పరాయి సినిమానా అని కూడా చూడట్లేదు. మొన్నటికిమొన్న సూర్య హీరోగా నటించిన వీరభద్రుడు, మోహన్ లాల్ దృశ్యం 3 సినిమాలకు టాక్ సోసోగానే వచ్చినా.. కలెక్షన్లు బాగా రావడానికి కారణం నార్మల్ టికెట్ రేట్లే. టికెట్ రేట్ల మీద కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీస్ కూడా మాట్లాడుతున్నారు. పెద్ది సమయంలోనే రామ్ చరణ్ కూడా రేట్లపై ఓపెన్ అయ్యారు. ఇండియాలో సినిమానే చీపెస్ట్ ఎంటర్‌టైన్మెంట్ అని.. కాకపోతే థియేటర్లలో పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉండటం వల్లే సామాన్య కుటుంబాలు సినిమాకు దూరమవుతున్నాయని, వాటిని తగ్గించాలని చరణ్ సూచించారు. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి థియేట‌ర్‌లో ఉన్న పాప్‌కార్న్ ధ‌ర‌లే కారణమంటూ నాగవంశీ కూడా చెప్పుకొచ్చారు. ఆడియన్స్‌కు రేట్లతో సమస్య లేదనేది ఆయన వాదన. అయితే రేట్లు పెంచిన ప్రతీసారి విమర్శలైతే వస్తున్నాయి. కానీ నార్మల్ రేట్లు ఉన్నపుడు మాత్రం.. కొన్నిసార్లు యావరేజ్ కంటెంట్ కూడా అదరగొడుతుంది. మరి దీనిపై నిర్మాతలు ఇప్పటికైనా ఓ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Follow Us