డార్లింగ్‌తో స్వీటీ… స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారా ??

Edited By: Phani CH

Updated on: Nov 11, 2025 | 5:58 PM

బాహుబలి, బాహుబలికి సంబంధించిన విషయాలే కాదు.. అందులో నటించిన నటీనటులు కూడా ట్రెండ్‌ అవుతున్నారిప్పుడు. కాంతా సినిమాతో రానా లైమ్‌లైట్‌లోకి వచ్చేస్తే... కల్కి2తో డార్లింగ్‌ ప్రభాస్‌ పేరు వైరల్‌ అవుతోంది. అయితే రేపోమాపో ప్రభాస్‌తో పాటు అనుష్క పేరు కూడా ట్రెండ్‌ కావడం ఖాయం... అది కూడా కల్కి2తో ముడిపెట్టి.

బాహుబలి, బాహుబలికి సంబంధించిన విషయాలే కాదు.. అందులో నటించిన నటీనటులు కూడా ట్రెండ్‌ అవుతున్నారిప్పుడు. కాంతా సినిమాతో రానా లైమ్‌లైట్‌లోకి వచ్చేస్తే… కల్కి2తో డార్లింగ్‌ ప్రభాస్‌ పేరు వైరల్‌ అవుతోంది. అయితే రేపోమాపో ప్రభాస్‌తో పాటు అనుష్క పేరు కూడా ట్రెండ్‌ కావడం ఖాయం… అది కూడా కల్కి2తో ముడిపెట్టి. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఫేమ్‌ తెచ్చుకోవడానికి అనుష్కకు ఇంకో అవకాశం దక్కినట్టేనా? మాట్లాడుకోబోయే విషయం ఏంటో మీకు లైట్‌గా అర్థమైనట్టేగా… ఏమంటారూ.. మరింక ఆలస్యం ఎందుకు చూసేద్దాం వచ్చేయండి.. ప్రభాస్‌, అనుష్కను రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ కలిసి చూడాలనుకునే అభిమానుల సంఖ్య కోకొల్లలు. అయితే రీసెంట్‌గా అనుష్క నెమ్మదిగా స్క్రీన్ కి దూరమవుతుండటంతో ఇక కలిసి సినిమాలు చేస్తారని కూడా ఊహించడం మానేశారు జనాలు… అయితే ఇక్కడే ఓ స్వీట్‌ న్యూస్‌ వినిపిస్తోంది కల్కి2 యూనిట్‌ నుంచి. దీపిక పదుకోన్‌ కల్కి 2 నుంచి వైదొలగారు. మరి ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ నటి ఆ రోల్‌లో ఎవరు కనిపిస్తారనే చర్చ జోరుగానే సాగింది. వాళ్లు వీళ్లూ ఎందుకు? మన స్వీటీ శెట్టి ఉండగా అని ఫిక్సయ్యారట నాగ్‌ అశ్విన్‌. కల్కిలో సుమతి రోల్‌కి అనుష్కనే అప్రోచ్‌ అయ్యారట నాగీ. ప్రభాస్‌తో అనుష్క మళ్లీ కనిపిస్తారనే థాట్‌ సంతోషాన్ని పంచుతోంది డార్లింగ్‌ ఫ్యాన్స్ లో. మళ్లీ చూడవేమో అనుకున్న కాంబో కనిపిస్తుందంటే ఆ మాత్రం ఎగ్జయిట్‌మెంట్‌ ఉంటుంది కదా అంటున్నారు. ఆ మధ్య సోషల్‌ మీడియా నుంచి కూడా అనుష్క బ్రేక్‌ తీసుకున్నారు. ఇక ఒన్లీ సినిమాల మీదే కాన్‌సెన్‌ట్రేట్‌ ేయాలనుకుంటున్నాను అంటూ అనుష్క పోస్ట్ పెట్టినప్పుడు.. ఈ రేంజ్‌ సస్పెన్స్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అతి త్వరలోనే వీరిద్దరిని స్క్రీన్‌ మీద చూడాలనే ఇంట్రస్ట్ జనాల్లో క్రియేట్‌ అయింది. క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడంలో ముందుండే నాగీ..ఈ సారి ఏం ప్లాన్‌ చేస్తారోననే ఆసక్తి మాత్రం మెండుగానే కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు

H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌

మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా

పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ

Published on: Nov 11, 2025 05:56 PM