Anupama Parameswaran: పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది! అనుపమ బోల్డ్ కామెంట్స్

Updated on: Oct 17, 2026 | 5:24 PM

‘క్రేజీ కళ్యాణం’ సినిమా గురించి మాట్లాడిన అనుపమ పరమేశ్వరన్‌ వివాహం, మాతృత్వం, కుటుంబ బాధ్యతలపై తన అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోవడం తప్పనిసరి కాదని, భవిష్యత్తులో ఒక బిడ్డను పెంచుకోవాలనే కోరిక ఉందని ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే దత్తత లేదా ఐవీఎఫ్‌ వంటి మార్గాలను పరిశీలించవచ్చని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇంటి పనులను భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలని కూడా ఆమె అభిప్రాయపడినట్లు కథనం చెబుతోంది.

‘క్రేజీ కళ్యాణం’ సినిమా విశేషాలను పంచుకునే క్రమంలో అనుపమ పరమేశ్వరన్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో వివాహం, కుటుంబ బంధాలు, మహిళల పాత్రపై ఉన్న మూస ధోరణులను ప్రశ్నిస్తూ అనుపమ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, పిల్లల్ని కనండి అని నరేశ్ గతంలో చెప్పిన మాటను సమర్ధిస్తూ.. తన అమ్మ కూడా తనతో ఇదే చెబుతుందని అనుపమ చెప్పడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు అనుపమ తనకు పెళ్లికి ముందే ఒక బిడ్డ కావాలనే కోరిక ఉండేదని.. చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో తనకు అసలు పెళ్లవుతుందో లేదో తనకే స్పష్టత లేదని.. కానీ, ఒక పాపనో బాబునో పెంచుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. అందుకోసం అడాప్షన్ ద్వారానో లేదా ఐవీఎఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అంటూ.. నిర్మొహమాటంగా మాట్లాడేసింది. దాంపత్య జీవితంలో భార్యాభర్తల సమానత్వం గురించి కూడా అనుపమ మాట్లాడింది. పెళ్లి చేసుకునేది ఉచితంగా వచ్చే పనిమనిషి కోసం కాదని.. ఆడపిల్లల బాధ్యత కేవలం వంటింటికే పరిమితం కాకూడదంటూ అనుపమ అభిప్రాయపడింది. బయటకు వెళ్లి అలిసిపోయి ఇంటికి వచ్చాక మహిళ ఒక్కతే వంటింట్లోకి వెళ్లి వంట చేయాల్సి రావడం, పురుషులు విశ్రాంతి తీసుకోవడం సరైన పద్ధతి కాదంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లో పనులను ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. కనీసం ఆమెకు తోడుగా నిలిచే పార్టనర్ ఉండాలంటూ.. తన ఆలోచనలను కుండబద్దలు కొట్టినట్టుగా అందరితో పంచుకుంది ఈ హీరోయిన్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Khushboo: ఐదు పదుల వయసులోనూ.. నటి ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

థెరపీ చేయించుకుంటే ఇన్సూరెన్స్ ఇస్తారా?హెల్త్ పాలసీ తీసుకోబోయేముందు ఈ నిజాలు తెలుసుకోండి!

రూ.20 వేల జీతంతోనూ పర్సనల్ లోన్.. అర్హతలు ఏమిటి? ఎంతొస్తుందో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us