Ram Charan: రామ్​ చరణ్ RC 16లో యానిమల్ విలన్

|

Mar 20, 2024 | 11:23 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న RC16 గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ బాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. RC16 కి ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్‌​ను ఆయన అప్పుడప్పుడు షేర్‌ చేస్తున్నారు. ఈ మధ్యే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న RC16 గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ బాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. RC16 కి ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్‌​ను ఆయన అప్పుడప్పుడు షేర్‌ చేస్తున్నారు. ఈ మధ్యే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రంలో రీసెంట్​‌గా మళ్లీ ఫామ్​లోకి వచ్చిన బాలీవుడ్ స్టార్ యాక్టర్​, యానిమల్ విలన్​ బాబీ దేవోల్​ కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. యానిమల్ చిత్రంలో తన 12 నిమిషాల విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు బాబీ దేవోల్. అయితే ఇప్పుడు ఈ పుకార్లతో పాటు ఆర్​సీ 16కు సంబంధించి మరొక క్రేజీ న్యూస్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో రామ్​ చరణ్​ పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల ఈ చిత్రంలో నటించే నటినటులను కూడా అన్ని ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలనుకుంటుంది చిత్ర యూనిట్. అందుకే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌​ను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Follow us on