AA23పై క్రేజీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రానున్న AA23 ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తలను మేకర్స్ ఖండించారు. ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని బన్నీ టీం స్పష్టం చేసింది. లోకేష్ కథను మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నారని, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ రాకా సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారని తెలియజేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న AA23 ప్రాజెక్ట్‌పై గత కొద్ది రోజులుగా నెట్టింట తీవ్రమైన ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, లోకేష్ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు నచ్చలేదని పలు కథనాలు ప్రచారమయ్యాయి. లోకేష్ ఇతర హీరోలతో కథలు వింటున్నారన్న వార్తలు ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోశాయి.అయితే, ఈ వార్తలపై బన్నీ పీఆర్ టీం పూర్తి స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని తేల్చి చెప్పింది. AA23 ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తుందని బన్నీ టీం ధృవీకరించింది. లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్‌ను పూర్తిగా మెప్పించేలా స్క్రిప్ట్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చేందుకు మూడు నెలల సమయం తీసుకున్నారని సమాచారం.ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమాను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
