బన్నీ – తారక్‌తో సినిమా.. లోకేష్‌ సెట్‌ చేస్తారా ??

Edited By:

Updated on: Dec 17, 2025 | 4:09 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ గ్లోబల్ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక సినిమాలో నటించవచ్చని ఫిలింనగర్ టాక్. ఈ కాంబినేషన్ సెట్ అయితే రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ భవిష్యత్ సినిమాలపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు కంప్లీట్‌ అయితే మన హీరోలు నెక్స్ట్ ఏం సినిమాలు చేయబోతున్నారనే డిస్కషన్‌ ఇప్పుడు మరింత ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. సోలోగా ఏం చేస్తారు? కలిసి ఏం చేస్తారనే మాటలు ఫ్యాన్స్ కి కిక్‌ ఇస్తున్నాయి. వారణాసి తర్వాత మహేష్‌బాబు ఏ సినిమాలో నటిస్తారనేది వేయి డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం రాజమౌళి సినిమా మీదే ఫోకస్‌. ఆ తర్వాతే దేని గురించైనా ఆలోచిస్తారని సూపర్‌స్టార్‌ కాంపౌండ్‌ చెబుతూనే ఉన్నా, ఫ్యాన్స్ మాత్రం కాంబినేషన్ల గురించి క్యాల్కులేషన్స్ వేయడం ఆపడం లేదు. ఐకాన్‌ స్టార్‌ విషయంలోనూ అలాంటి మాటే వినిపిస్తోంది. అట్లీ డైరక్షన్‌లో ప్రస్తుతం గ్లోబల్‌ ప్రాజెక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమా తర్వాత ఆయనేం చేయబోతున్నారనే టాక్‌ ఆల్రెడీ మొదలైంది. లోకేష్‌ కనగరాజ్‌ చెప్పిన సూపర్‌ హీరో కథకు ఫిదా అయ్యారన్న న్యూస్‌ ఉంది. ఈ న్యూస్‌తో తారక్‌కీ ఓ లింకుంది. ఐకాన్‌ స్టార్‌ – లోకేష్‌ సినిమాలో తారక్‌ కీ రోల్‌ చేయబోతున్నారన్నది ఫిల్మ్ నగర్‌ మాట. అల్లు అర్జున్‌ – తారక్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే గ్లోబల్‌ బాక్సాఫీస్‌ షేక్‌ కావడం గ్యారంటీ. ఏదో ఒకటి చేసి, లోకేష్‌ ఈ కాంబో సెట్‌ చేస్తే ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ గాయబ్‌ కావడం ఖాయమనే పాజిటివ్‌ బజ్‌ వినిపిస్తోంది. లోకేష్‌ సిద్ధం చేసే కథలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ని ఊహించుకుంటున్నవారూ లేకపోలేదు. అయితే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఏ సినిమా చేస్తారనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. అఫిషియల్‌గా ఇదీ ప్రాజెక్ట్ అని హీరోలు అనౌన్స్ చేసేవరకు.. ఇలాంటి ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పడే ఛాన్సేలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు

హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ దోపిడీ

డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి

Pawan Kalyan: పవన్‌ డ్యాన్స్‌ ఎఫెక్ట్‌ షేక్ అవుతున్న సోషల్ మీడియా..

Published on: Dec 17, 2025 04:09 PM