పెళ్లైన తర్వాత మారిపోతున్న సీనియర్ హీరోయిన్లు

Edited By:

Updated on: Sep 19, 2026 | 6:26 PM

పెళ్లి తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయనే రోజులు మారిపోయాయి. ప్రస్తుతం పలువురు సీనియర్‌ హీరోయిన్లు పెళ్లి తర్వాత మరింత సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నారు. సమంత ‘మా ఇంటి బంగారం’తో, రష్మిక ‘రణబాలి’, ‘మైసా’, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌తో విభిన్న పాత్రలు చేస్తున్నారు. నయనతార ‘రక్కయ్‌’, ‘మహాశక్తి’ వంటి ప్రాజెక్టులతో ముందుకెళ్తుండగా, కీర్తి సురేష్‌ కూడా కొత్త సినిమాలను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు.

పెళ్ళి తర్వాత హీరోయిన్లకు అవకాశాలు రావు అనే జమానా కాదిది.. ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ అదిరిపోయే అవకాశాలు అందుకుంటున్నారు. అయితే ఇక్కడే చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నారు సీనియర్ హీరోయిన్లు. ఏది పడితే అది కాకుండా కౌంట్ కంటే కంటెంట్ ముఖ్యం అంటున్నారు. మరి అలా సెలెక్టివ్‌గా వెళ్తున్న మ్యారీడ్ ముద్దుగుమ్మలెవరో చూద్దామా..? ఎంత కాదన్నా పెళ్లికి ముందు ఏ సినిమా పడితే ఆ సినిమా చేసినట్లు.. పెళ్లి తర్వాత చేయడం కష్టమే. సీనియారిటీ అయినా మరేదైనా కావొచ్చు.. ఎంచుకునే కథల్లో మార్పైతై వస్తుంది. మన సీనియర్ బ్యూటీస్‌లో ఈ మార్పులే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమంత మా ఇంటి బంగారంతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తే.. రష్మిక మందన్న రణబాలితో రాబోతున్నారు. ఇందులో 18వ శతాబ్ధపు గృహిణిగా నటిస్తున్నారీమే. మైసాలోనూ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నారు రష్మిక. తాజాగా ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌ ఓకే చేసారు. సరిగ్గా వర్కవుట్ అయితే కీర్తి సురేష్‌కు మహానటి ఎలా నిలిచిపోయిందో.. రష్మికకు MS బయోపిక్ అలా లైఫ్ లాంగ్ గుర్తుండటం ఖాయం. అందుకే ఈ పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకుంటున్నారు. అలాగే నయనతార ఎప్పట్లాగే చాలా సెలెక్టివ్‌గా ముందుకెళ్తున్నారు. స్టార్ హీరోల సినిమాలైనా.. తన పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోతే నో చెప్పేస్తున్నారు నయన్. అలాగే ప్రస్తుతం రక్కయ్ సినిమాతో పాటు మహాశక్తి అనే సినిమా చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ సైతం పెళ్లి తర్వాత జాగ్రత్తగా సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం రౌడీ జనార్ధనతో పాటు వెంకీతో జనవరి 12 విడుదల సినిమాలో నటిస్తున్నారు. మొత్తానికి ఈ హీరోయిన్స్ అంతా ఆఫ్టర్ మ్యారేజ్ మరింత జాగ్రత్తగా ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ …అభిషేక్‌ శర్మ వరల్డ్‌ రికార్డ్‌

ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!

దేశవ్యాప్తంగా పనీర్‌ బ్యాన్‌! 5 వేల లైసెన్సులు రద్దు!

UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?

Nirmala Seetharaman: ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్‌

Loading...
Unable to load recommendations.
Follow Us