AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Shetty Birthday: రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.

Neha Shetty Birthday: రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.

Anil kumar poka
|

Updated on: Dec 10, 2023 | 1:39 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ నేహాశెట్టి‏కి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అభిమానులు ఆమె రాధిక అంటూ పిలుచుకుంటుంటారు. అంతగా ఆ పాత్రతో అడియన్స్‏కు దగ్గరయ్యింది ఈ బ్యూటీ. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాలో హీరోయిన్‏గా నటించింది నేహాశెట్టి. ఇందులో రాధిక పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించింది. గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. తెలుగులో బిజీ అయిపోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ నేహాశెట్టి‏కి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అభిమానులు ఆమె రాధిక అంటూ పిలుచుకుంటుంటారు. అంతగా ఆ పాత్రతో అడియన్స్‏కు దగ్గరయ్యింది ఈ బ్యూటీ. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాలో హీరోయిన్‏గా నటించింది నేహాశెట్టి. ఇందులో రాధిక పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించింది. గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. తెలుగులో బిజీ అయిపోయింది. ఇక ఈక్రమంలోనే రెండు మూడు రోజుల క్రితం.. తన బర్త్‌ డే సెలబ్రేషన్స్ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. 2016లోనే కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నేహా.. ఆ తర్వాత 2018లో ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అయితే ఈ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు కానీ.. ఆ తర్వాత వచ్చి డీజే టిల్లు మాత్రం ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మార్చేసింది. అయితే డిసెంబర్ 5న నేహా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నేహా తన బర్త్ డే సెలబ్రెషన్స్ ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో ఆమె తల్లిదండ్రులు, చెల్లి కనిపిస్తున్నారు. దీంతో ఈ ఫోటోస్ వైరల్ గా మారాయి. మొదటిసారి నేహా ఫ్యామిలీ ఫోటోస్ ఇలా బయటకు రావడంతో నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. అందులో నేహా చెల్లి అచ్చం అక్కలాగే కనిపిస్తుంది. దీంతో భవిష్యత్తులో ఆమె సైతం హీరోయిన్ గా ఎంట్రీ కన్ఫార్మ్ అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.