దాహాగా అమీర్.. ఆకట్టుకుంటున్న ఖాన్ విలన్ లుక్
లోకేష్ కనగరాజ్..! ఫిల్మ్ మేకింగ్‌లో కాదు కానీ.. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో.. రిలీజ్‌కు ముందే తన కంటెంట్ పై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేయడంలో ఈయన రూటే సపరేట్. తన కెరీర్ బిగినింగ్ నుంచి.. తన స్టోరీస్ కోసం స్టార్ హీరోలను ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ సాధించి.. ఆ తర్వాత గ్రిప్పింగ్ స్క్రీన్ ష్లేతో... రిమైనింగ్ సక్సెస్‌ను ఈజీగా కొట్టేస్తారు.
ఇక ప్రీ ప్రొడక్షన్ ముందు… పోస్టర్స్ డిజైన్స్‌పై ఫోకస్ పెట్టి.. వాటితోనే తన సినిమాపై హైప్ పెంచుతాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాను రజినీ కూలీ విషయంలోనూ చేస్తున్నాడు. తన సినిమాలో యాక్ట్ చేస్తున్న ఒక్కొక్క స్టార్ హీరో లుక్‌ను .. క్యారెక్టర్ నేమ్‌ను రివీల్ చేస్తూ.. కూలీ సినిమాపై స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేశాడు. రీసెంట్‌గా అమీర్ ఖాన్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి.. నార్త్ లో సెన్సేషనల్ అయ్యాడు ఈ డైరెక్టర్. ఎట్ ప్రజెంట్ సితార జమీర్ పర్ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన అమీర్ ఖాన్‌ను.. ఇటీవల కలిసిన లోకి.. తన కూలీ సినిమాలో.. ఆయనకు ఓ రోల్ ఆఫర్ చేశాడు. ఇక రజినీ సినిమా కావడంతో.. పైగా రోల్ కూడా నచ్చడంతో అమీర్ ఓకే చెప్పాడు. కట్ చేస్తే.. అమీర్‌కు సంబంధించిన లుక్ అండ్ క్యారెక్టర్ పేరును రివీల్ చేస్తూ.. ఓ సెన్సేషనల్ పోస్టర్ను జెట్ స్పీడ్‌లో రిలీజ్ చేశాడు లోకి. ఇప్పటికే నెగెటివ్ షేడ్స్ లో నటిస్తున్న నాగ్‌కి తోడు.. అమీర్ కూడా దాహా క్యారెక్టర్‌లో నెగెటివ్ షేడ్స్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక లోకి రిలీజ్ చేసిన పోస్టర్లో దాహా అలియాస్ అమీర్ … నోట్లో సిగార్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. క్లాసీ స్పెక్ట్స్‌తో.. చెవికి డైమెండ్ స్టోన్‌తో… ఇంటెన్సివ్ లుక్‌తో అమీర్ మెస్మరైజ్ చేస్తున్నాడు. అయితే అమీర్ లుక్ పై సౌత్ ఆడియన్స్ అంత ఎక్కువగా ఎగ్జైట్ కాకున్నా.. నార్త్ ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతున్నారు. అమీర్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నితిన్ ఖాతాలో హిట్ పడిందా.. లేదా.. తెలియాలంటే వీడియో చూసేయండి మరి
డిఫరెంట్ పాత్రలో కీర్తి సురేశ్ ఆకట్టుకుందా ?? ఉప్పు కప్పురంబు రివ్యూ
3BHK Review: సిద్ధార్థ్ 3BHK రివ్యూ.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుందా

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
